Asianet News TeluguAsianet News Telugu

షియోమీ నుండి కొత్త ఎంఐ 10, ఎంఐ 10 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్...?

షియోమీ ఎంఐ 10, ఎంఐ 10 ప్రో వేరియంట్ ఫొన్ల ఫీచర్లు బయటకు వచ్చాయి. ఇవి 108 ఎంపీ ప్రైమరీ లెన్స్​, 66 వాట్స్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​తో వస్తున్నట్లు తెలుస్తున్నది. ఎంఐ 6,8,9 స్మార్ట్​ఫోన్లను భారత్​కు తీసుకురాని షియోమీ ఇక ముందు ఎంఐ 10 విషయంలో కూడా అదే ఒరవడి కొనసాగించనున్నట్లు సమాచారం.
 

Xiaomi MI 10 and MI 10 Pro Specs Leaked 108MP Primary Lens In Tow
Author
Hyderabad, First Published Jan 7, 2020, 2:48 PM IST

బీజింగ్: చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ తన ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్లు ఎంఐ 10, ఎంఐ 10 ప్రోలను విపణిలోకి తేవడానికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్ 865 ప్రాసెసర్​తో ఈ ఎంఐ 10 హ్యాండ్​సెట్​ను తేనున్నట్లు షియోమీ స్పష్టం చేసింది. అయితే వాటిని ఎప్పుడు ఆవిస్కరిస్తారన్నది వెల్లడించలేదు.

also read ఫేస్ బుక్, ట్విట్టర్ లాగే త్వరలో వాట్సాప్‌లోకి మరో కొత్త ఫీచర్...

బార్సిలోనాలో జరగనున్న 2020 టెక్​ షోలో షియోమీ.. ఎంఐ 10, ఎంఐ 10 ప్రో ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్ల ఆవిష్కరించనున్నట్లు మాత్రం వార్తలొస్తున్నాయి.చైనీస్​ మైక్రోబ్లాగింగ్ పోర్టల్​ వీబోలో... షియోమీ ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్ల ఫీచర్లు బహిర్గతం అయ్యాయి. వీటి ప్రకారం  ఎంఐ 10, ఎంఐ 10 ప్రోల్లో కెమెరా, బ్యాటరీ సామర్థ్యం, అధిక రీఫ్రెష్​​ రేట్ స్క్రీన్లు లాంటి అంశాలే తప్ప మిగిలిన ఫీచర్లన్నీ ఒకేలా ఉంటాయని తెలుస్తోంది.

Xiaomi MI 10 and MI 10 Pro Specs Leaked 108MP Primary Lens In Tow

ఎంఐ 10 వేరియంట్ ఫోన్‌లో 6.5 అంగుళాల ఓఎల్​ఈడీ డిస్ ప్లే, 90 హెచ్​జడ్​ రీఫ్రెష్​ రేట్ స్క్రీన్​తోపాటు ఇన్​ డిస్​ప్లే ఫింగర్​ప్రింట్ స్కానర్ అమర్చారు. 5జీ సపోర్ట్ గల క్వాల్​కామ్​ స్నాప్​ డ్రాగన్​ 865 ప్రాసెసర్​ ఉంటుంది. ఇంకా 12జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతోపాటు 4500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ, దానికి 40 వాట్​ వైర్డ్​ ​+30 వాట్​ వైర్​లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్లు ఉంటాయి.

also read హానర్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్...128gb ఇంటర్నల్ స్టోరేజ్ తో...

ఈ ఫోన్‌లో 64ఎంపీ సోనీ ఐఎమ్​ఎక్స్686 సెన్సార్  20ఎంపీ సెకండరీ సెన్సార్​  కెమెరా, 12ఎంపీ థర్డ్​ సెన్సార్​ + 5ఎంపీ మాక్రో/డెప్త్​ సెన్సార్​   కెమెరాలు ఉండవచ్చు.ఇక ఎంఐ 10 ప్రో వేరియంట్ ఫోన్‌లో 6.5 అంగుళాల ఓఎల్​ఈడీ డిస్ ప్లే, 90 హెచ్​జడ్​ రిఫ్రెస్​ రేట్ స్క్రీన్​, ఇన్​ డిస్​ప్లే ఫింగర్​ప్రింట్​ స్కానర్​, క్వాల్​కామ్ స్నాప్​డ్రాగన్​ 865 ఎస్​ఓసీ ఫీచర్లు జత కలిశారు.

5జీ సపోర్ట్​ కలిగి ఉన్న ఈ ఫోన్ 12జీబీ ర్యామ్​ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కలిగి ఉంటుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. కెమెరాల విషయానికి వస్తే శామ్​సంగ్ సెన్సార్ 108 ఎంపీ ప్రైమరీ కెమెరా లెన్స్​, 48 ఎంపీ సెకండరీ సెన్సార్​, 12 ఎంపీ థర్డ్ సెన్సార్ ​+ 8 ఎంపీ డెప్త్​/మాక్రో సెన్సార్​ ఉంటాయని భావిస్తున్నారు.


షియోమీ చివరిసారిగా తన ఫ్లాగ్​షిప్ ఫోన్​ ఎంఐ 5ను భారత్​ మార్కెట్​లో విడుదల చేసింది. దాని తరువాత వచ్చిన ఎంఐ 6,8,9 స్మార్ట్​ఫోన్లను భారత్​కు తీసుకు రాలేదు. ఎంఐ 10 విషయంలో కూడా అదే ఒరవడి కొనసాగించనున్నట్లు సమాచారం.భారత్​ విషయంలో షియోమీ భిన్నమైన వ్యూహాన్ని అమలుచేస్తోంది. రెడ్​మీ, పోకో బ్రాండ్లపై మాత్రమే ప్రస్తుతం దృష్టిసారించింది.

Follow Us:
Download App:
  • android
  • ios