షియోమి నుంచి కొత్త వైర్‌లెస్ ప్రాడక్ట్...తక్కువ ధరకే..
షియోమి సంస్థ ఇప్పుడు ఆఫీస్ సంబంధించిన వర్క్ లక్ష్యంగా వైర్‌లెస్ కీబోర్డ్, మౌస్ సెట్ రూపొందించింది. షియోమి వైర్‌లెస్ కీబోర్డ్, మౌస్ సెట్ ప్లగ్-అండ్-ప్లే విధానాన్ని కూడా కలిగి ఉంది. దీని ధర చైనాలో CNY 99 (సుమారు రూ. 1,000).
షియోమి బ్రాండ్ కంపెనీ ఇప్పుడు కొత్త షియోమి వైర్‌లెస్ కీబోర్డ్, మౌస్ సెట్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఈ కీబోర్డ్, మౌస్ కిట్ ఆఫీస్ సంబంధించిన పనులు చేసుకోడానికి సులభం చేస్తుంది. ఇది నో-ఫ్రిల్స్, నో-ఫస్ డిజైన్ తో ఉంటుంది. కొత్త షియోమి కీబోర్డ్, మౌస్ సెట్ యుటిలిటేరియన్ డిజైన్ ఫీచర్ తో తక్కువ ధరలో లభిస్తుంది. షియోమి వైర్‌లెస్ కీబోర్డ్, మౌస్ సెట్ ప్లగ్-అండ్-ప్లే విధానాన్ని కూడా కలిగి ఉంది. దీని ధర చైనాలో CNY 99 (సుమారు రూ. 1,000).
also read రానున్న రోజుల్లో ఆన్లైన్ షాపింగ్ ఎలా ఉంటుంది తెలుసా...?
ఈ కీబోర్డ్ డిజైన్ గురించి చెప్పాలంటే కొత్త షియోమి వైర్‌లెస్ కీబోర్డ్ ఇంకా మౌస్ రెండూ బ్లాక్ కలర్ లో ఉంటాయి. దీనికి డ్రైవర్ ఇన్‌స్టాలేషన్ అవసరం లేకుండా కీబోర్డ్‌ను ప్లగిన్ చేసి ఉపయోగించుకోవచ్చు. కీబోర్డులో ఫుల్ 104-కీ లేఅవుట్, కుడి వైపున డేడికేటెడ్ నమ్‌ప్యాడ్, మీడియా కంట్రోల్, స్క్రీన్ క్యాప్చర్ ఇంకా మరిన్ని ఫంక్షన్ కీస్ పైభాగం వరుసలో ఉంటాయి.
కొత్త షియోమి కీబోర్డ్ సౌకర్యవంతమైన టైపింగ్ అనుభవం కోసం 6-డిగ్రీల ఎత్తుతో ఉంటుంది. కీబోర్డు పై లేజర్ డిజైన్ అక్షరాలు ఉంటాయి, అంటే అవి స్పష్టంగా, సులభంగా కనిపించటానికి. ఈ కీబోర్డులో స్మార్ట్ స్లీప్ మోడ్ ఆప్షన్ ఉంది, ఇది కీబోర్డ్ వాడనపుడు, లేదా మధ్యలో వొదిలేసిన ఆటోమేటిక్ గా పవర్ సప్లయ్ ఆపివేస్తుంది. స్మార్ట్ స్లీప్ మోడ్ లో ఉన్నప్పుడూ వినియోగదారులను అప్రమత్తం చేయడానికి మూడుసార్లు మెరిసే లైట్ బ్లింక్ అవుతుంది.
also read JIO OFFERS: జియో ప్రీపెయిడ్ రిచార్జ్ ప్లాన్ పై కొత్త ఆఫర్...
కొత్త షియోమి మౌస్ బరువు 60 గ్రాములు మాత్రమే, ఇది 1,000DPI మోడెస్ట్ ఆప్టికల్ సెన్సిటివిటీ కలిగి ఇంకా స్పొర్ట్స్ సిమ్మెట్రికల్ డిజైన్ ద్వారా ఎడమ మరియు కుడి చేతి వారు సులభంగా దీనిని ఉపయోగించవచ్చు.ఇందులో AAA బ్యాటరీల నుండి పవర్ సప్లై అవుతుంది. షియోమి వైర్‌లెస్ కీబోర్డ్ మరియు మౌస్ కిట్ 2.4GHz నెట్‌వర్క్‌తో కనెక్ట్ అవుతుంది.