సామ్‌సంగ్  గెలాక్సీ అన్ప్యాక్డ్ 2020 ఈవెంట్ సామ్‌సంగ్  చివరకు గెలాక్సీ ఎస్ 20 సిరీస్‌ను ప్రేవేశపెట్టింది. సామ్‌సంగ్  గెలాక్సీ ఎస్20 ఫోన్‌లలో కొత్త ఫీచర్లు ఉన్నప్పటికీ ఇందులో అదనంగా స్పేస్‌ జూమ్, 100x జూమ్ కెమెరా సామర్థ్యాన్ని అందిస్తుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ డిజైన్ ఎస్ 10 ఫోన్‌లగానే ఉంటుంది. గెలాక్సీ ఎస్ 10 సిరీస్ ఫోన్‌లు ఇప్పుడు తక్కువ ధరకే అందించాలని ఆలోచిస్తుంది. సామ్‌సంగ్  గెలాక్సీ ఎస్20, గెలాక్సీ ఎస్20ప్లస్, గెలాక్సీ ఎస్20అల్ట్రా లాంచ్ చేసిన తరువాత, శామ్సంగ్  గెలాక్సీ ఎస్10 సిరీస్ స్మార్ట్ ఫోన్లపై  ధరలను భారీగా తగ్గించింది.

also read చైనా టీవీల దిగుమతిపై ఆంక్షలు...ఆర్థికశాఖ కీలక నిర్ణయం..

ప్రతుత్తం తగ్గించిన సామ్‌సంగ్ ఎస్10 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ధర ఇప్పుడు కంపెనీ వెబ్‌సైట్‌లో ఉంచారు. సామ్‌సంగ్  గెలాక్సీ ఎస్10ప్లస్, గెలాక్సీ ఎస్10, గెలాక్సీ ఎస్10ఇ మూడు ఫోన్‌లలోని 128జి‌బి స్టోరేజ్ వేరియంట్  మాత్రమే శామ్‌సంగ్ వెబ్‌సైట్‌లో తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్నాయి.  

భారతదేశంలో గెలాక్సీ ఎస్ 10ప్లస్ 128 జిబి వేరియంట్  ధర 61,900 రూపాయలకు అందిస్తున్నారు. ఇంతకుముందు దీని ధర రూ.79,000లకు వెబ్‌సైట్‌లో ఉంది. కొత్త ధరలను కంపెనీ వెబ్‌సైట్‌లో ఉంచారు. మీరు గెలాక్సీ ఎస్ 10ప్లౌస్ ను ఆఫ్‌లైన్ స్టోర్లలో లేదా ఆన్‌లైన్ స్టోర్లలో తక్కువ ధరకే పొందవచ్చు.

also read ఎయిర్‌టెల్ డేటా, వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో 4 కొత్త రీఛార్జ్ ప్లాన్లు

గెలాక్సీ ఎస్10ప్లస్  ప్రిజం వైట్, ప్రిజం బ్లాక్, ప్రిజం బ్లూ, సిరామిక్ బ్లాక్, సిరామిక్ వైట్ వంటి కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు ఈ సిరీస్‌లో వస్తున్న గెలాక్సీ ఎస్10 ధర కూడా పడిపోయింది.128 జీబీ వేరియంట్ మీరు శామ్సంగ్ వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు. దీని ప్రస్తుత ధర  రూ.54,900 రూపాయలకు పొందవచ్చు.

ఇది గతంలో అధికారిక వెబ్‌సైట్‌లో రూ.71,000 రూపాయలు ఉంది. గెలాక్సీ ఎస్10 ప్రిజం బ్లాక్, ప్రిజం బ్లూ, ప్రిజం వైట్ కలర్లలో లభిస్తుంది. చివరగా మూడు మోడళ్లలో ఒకటైన గెలాక్సీ ఎస్10ఇ 128GB వేరియంట్ సామ్‌సంగ్  వెబ్‌సైట్ నుండి రూ.47,900 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఇది గతంలో 55,900 రూపాయలకు అందుబాటులో ఉంది.

ఇప్పుడు, గెలాక్సీ ఎస్ 10ఇ  లాంచ్ ధర కంటే రూ .8 వేల తగ్గింపు ఉంది. అయితే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్10ఇ గత ఏడాది నవంబర్‌లో ఆఫర్ కింద రూ .47,900 కు లభించింది. ఇది ప్రిజం వైట్, ప్రిజం బ్లాక్ కలర్ వేరియంట్లలో వస్తుంది.