ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ శామ్‌సంగ్  మరో కొత్త స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించేందుకు సిద్దమవుతుంది. ఇంతముందు లేని విధంగా అతిపెద్ద బ్యాటరీతో  ముందుకు వస్తుంది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎం51 సెప్టెంబర్ 10న భారత్‌లో లాంచ్ కానున్నట్లు అమెజాన్ మైక్రోసైట్ ద్వారా వెల్లడించింది.

శామ్సంగ్ గెలాక్సీ ఎం51 ను గెలాక్సీ ఎం-సిరీస్ కింద జర్మనీలో విడుదల చేసిన ఒక రోజు తర్వాత ఈ విషయాన్ని వెల్లడిచింది. ఈ స్మార్ట్ ఫోన్ హోల్ -పంచ్ డిస్ ప్లేతో, క్వాడ్ రియర్ కెమెరాలతో వస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎం51లో విశేషం ఏంటంటే అతిపెద్ద భారీ 7,000 ఎంఏహెచ్ బ్యాటరీని. భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 51 లాంచ్‌ను కంపెనీ సోషల్ మీడియా ద్వారా చిన్న వీడియో షేర్ చేసింది.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం51 ఇండియా లాంచ్ వివరాలు
అమెజాన్ సృష్టించిన మైక్రోసైట్ ప్రకారం శామ్సంగ్ గెలాక్సీ ఎం51 సెప్టెంబర్ 10న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో లాంచ్ అవుతుంది. అమెజాన్ లిస్టింగ్ ప్రకారం గెలాక్సీ ఎం51  సంబంధించి కొన్ని ముఖ్యమైన ఫీచర్లను టిసర్ ద్వారా స్మార్ట్ ఫోన్ ముందు, వెనుక డిజైన్‌ను చూపించింది.

also read చిప్స్ ప్యాకెట్ కొంటె ఫ్రీ ఇంటర్నెట్.. ఎయిర్‌టెల్ వెరైటీ ఆఫర్.. ...

భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 51 ధర (అంచనా)
భారతదేశంలో శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 51 ధరను త్వరలో వెల్లడించనున్నారు. అయితే జర్మనీలో సోమవారం ప్రకటించిన ధరలకు అనుగుణంగా ఉండే అవకాశం ఉంది. బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో వచ్చే ఏకైక 6జి‌బి + 128జి‌బి స్టోరేజ్ వేరియంట్ ధర యూరో 360 (సుమారు ఇండియాలో రూ. 31,600)నుండి ప్రారంభం కానుంది. అంటే గెలాక్సీ ఎం51 భారత మార్కెట్లోకి రూ. 25 వేలు నుండి రూ.30,000 ఉండొచ్చు అని అంచనా.

శామ్సంగ్ గెలాక్సీ ఎం51 ఫీచర్స్ 
 ఆండ్రాయిడ్ 10 వన్ యుఐ, హోల్-పంచ్ డిజైన్‌, 6.7-అంగుళాల పూర్తి-హెచ్‌డి + సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ డిస్ ప్లే, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్, 6జి‌బి ర్యామ్, మైక్రో ఎస్‌డి కార్డ్ ఆప్షన్, 128జి‌బి ఇంటర్నల్ స్టోరేజ్, ఫోటోలు అండ్  వీడియోల కోసం క్వాడ్ రియర్ కెమెరా సెటప్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, దీనితో పాటు f / 1.8 లెన్స్ ఉంటుంది. అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 5-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా, మాక్రో లెన్స్‌తో 5 మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరా, 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, ఫోన్ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎం51లో 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌తో సహా ఇతర కనెక్టివిటీ ఆప్షన్స్ అందించింది. అంతేకాకుండా ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో  7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.