Asianet News TeluguAsianet News Telugu

రియల్‌మి లేటెస్ట్ స్మార్ట్‌ టీవీ..తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు...

రియల్‌ మి స్మార్ట్ ఫోన్ తయారీతో  పాటు స్మార్ట్‌ టీవీల సెగ్మెంట్‌లోకి  తాజాగా ఎంట్రీ ఇచ్చింది. రియల్‌ మీ కొత్త స్మార్ట్ టీవీ మొదటి సేల్స్ ఈ రోజు ఫ్లిప్‌కార్ట్, రియల్‌.కామ్‌ ద్వారా ప్రారంభమయ్యాయి. 

real me latest smart tv launched with updated features with low cost
Author
Hyderabad, First Published Jun 2, 2020, 6:27 PM IST

న్యూఢిల్లీ: చైనా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌ మి స్మార్ట్ ఫోన్ తయారీతో  పాటు స్మార్ట్‌ టీవీల సెగ్మెంట్‌లోకి  తాజాగా ఎంట్రీ ఇచ్చింది. రియల్‌ మీ కొత్త స్మార్ట్ టీవీ మొదటి సేల్స్ ఈ రోజు ఫ్లిప్‌కార్ట్, రియల్‌.కామ్‌ ద్వారా ప్రారంభమయ్యాయి. దీని ధర రూ .12,999 నుండి ప్రారంభమవుతుంది

ఇందులో మీడియా టెక్‌ చిప్‌సెట్ 64-బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌, డాల్బీ ఆడియో క్వాడ్‌ స్పీకర్లు వంటి లేటెస్ట్ ఫీచర్లతో రూపొందించిన రెండు టీవీలను భారత మార్కెట్లో ఇటీవల ఆవిష్కరించింది. 32 అంగుళాల డిస్‌ప్లే(1366×768 రిజల్యూషన్‌) టీవీ ధర రూ.12,999 కాగా, 43 అంగుళాల డిస్‌ప్లే(1920×1080)  టీవీ ధర రూ.21,999గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.

రెండు టీవీల్లోనూ కేవలం స్క్రీన్‌ రిజల్యూషన్‌ లో మాత్రమే తేడా ఉంటుంది అని తెలిపింది. రియల్ మీ స్మార్ట్ టీవీ ర్యామ్ 2133MHz వద్ద క్లాక్ చేయబడింది, ఇది ఇతర టీవీలలో ఉపయోగించే సాధారణ 1600MHz ర్యామ్ కంటే వేగంగా ఉంటుంది. మంచి స్క్రీన్ క్వాలిటి కూడా అందిస్తాయి.

also read అలర్ట్: వెంటనే మీ ఫోన్ అప్‌డేట్ చేసుకొండి లేదంటే.. మీ ఫోన్ గోవిందా..

ఆండ్రాయిడ్ 9.0 ఆధారంగా ఈ టీవీలు ప‌నిచేస్తాయి. స్మార్ట్‌టీవీల ఫస్ట్‌సేల్‌ మంగళవారం రోజున మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైంది. ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మి.కామ్‌ ద్వారా స్మార్ట్‌ టీవీలను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. త్వరలోనే రిటైల్‌ స్టోర్లలోనూ టీవీలను కస్టమర్ల కోసం అందుబాటులో తీసుకురానున్నారు. 

రియల్‌ మీ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 9.0 లో నడుస్తుంది. గూగుల్ ప్లే స్టోర్, యూట్యూబ్ ద్వారా విభిన్న కంటెంట్‌ చూడవచ్చు. టీవీ గూగుల్ అసిస్టెంట్‌తో వస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వంటి యాప్స్  ముందే ఇన్‌స్టాల్ చేసి వస్తుంది, అలాగే వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి 5000+ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు యూట్యూబ్ ప్రీమియం, స్టాండర్డ్ ఇఎంఐ ఆప్షన్ ద్వారా 6 నెలల ఉచిత ట్రయల్ ప్రత్యేక ఆఫర్‌ను పొందవచ్చు. రియల్‌ మీ స్మార్ట్ టీవీ ఒక సంవత్సరం వారంటీతో పాటు ప్యానెల్‌ కి అదనంగా ఒక సంవత్సర వారంటీతో వస్తుంది. రియల్‌ మీ టివిని కొనుగోలు చేసిన వారికి 48 గంటల్లో వేగంగా డోర్-స్టెప్ ఇన్‌స్టాలేషన్ సేవలను కూడా అందిస్తోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios