Asianet News TeluguAsianet News Telugu

ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్... ధర ఎంతంటే ?

కొత్త ఏ31 స్మార్ట్ ఫోన్ 2015లో లాంచ్ చేసిన పాత మోడల్ ఒప్పో ఏ31కి భిన్నంగా ఉంటుంది. కొత్త ఫోన్ ప్రస్తుతం ఇండోనేషియా మార్కెట్లో మాత్రమే లాంచ్ చేశారు. ఒప్పో ఎ31 (2020 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో పి35  ఎస్‌ఓ‌సితో పనిచేస్తుంది. 

oppo launches a31 2020 model smart phone in india
Author
Hyderabad, First Published Feb 17, 2020, 10:42 AM IST

ఒప్పో స్మార్ట్ ఫోన్ కంపెనీ కొత్త  ఒప్పో ఎ31 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది మిడ్-రేంజ్ ఎ-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు అదనంగా ఉంటుంది.కొత్త ఏ31 స్మార్ట్ ఫోన్ 2015లో లాంచ్ చేసిన పాత మోడల్ ఒప్పో ఏ31కి భిన్నంగా ఉంటుంది.

కొత్త ఫోన్ ప్రస్తుతం ఇండోనేషియా మార్కెట్లో మాత్రమే లాంచ్ చేశారు. ఒప్పో ఎ31 (2020 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో పి35  ఎస్‌ఓ‌సితో పనిచేస్తుంది. ఇందులో 4 జిబి ర్యామ్, 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వస్తుంది. ఇది 6.5-అంగుళాల ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది.

also read 15 వేల మంది ఫ్రెషర్స్‌కు క్యాప్ జెమినీ జాబ్స్.. కాగ్నిజెంట్ కూడా

ఒప్పో ఏ31 (2020) ధర ఐ‌డి‌ఆర్ 25,99,000 (సుమారు రూ. 13,500) ప్రస్తుతం ఇండోనేషియా మార్కెట్లో లభిస్తుంది. లాజాడా, షాపీ, టోకోపీడియా, జెడిఐడి, బ్లిబ్లి, అకులాకుతో సహా ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా దీనిని విక్రయిస్తున్నారు. ఫోన్ మిస్టరీ బ్లాక్, ఫాంటసీ వైట్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులోకి వస్తుంది.

ప్రస్తుతం ఇతర మార్కెట్లలో లాంచ్ విషయమై  ఎలాంటి సమాచారం  లేదు.మీడియాటెక్ హెలియో పి35 ప్రాసెసర్ ద్వారా డ్యూయల్ సిమ్ (నానో) ఒప్పో ఎ31 మిడ్ రేంజ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ఫోన్ 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది.

oppo launches a31 2020 model smart phone in india

ఇతర స్పెసిఫికేషన్లలో ఒప్పో ఏ31 6.5-అంగుళాల హెచ్‌డి+ (720x1,600 పిక్సెల్స్) స్క్రీన్, 4230mAh బ్యాటరీ, వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఉంటుంది. ఒప్పో ఎ31 (2020) లోని కెమెరా విషయానికి వస్తే ఇందులో మూడు బ్యాక్ కెమెరాలు, ఒకటి ముందు భాగంలో ఒక కెమెరా ఉన్నాయి.

also read ఫ్లిఫ్‌కార్డ్ బంపర్ ఆఫర్స్: ‘మొబైల్స్ పై బొనంజా’

వెనుకవైపు ఉన్న మెయిన్ కెమెరాలో ఎఫ్ /1.8 లెన్స్‌తో 12 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. పోర్ట్రెయిట్ షాట్ల కోసం 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌తో పాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. వాటర్‌డ్రాప్ స్టయిల్ ఫ్రంట్ కెమెరాలో 8 మెగాపిక్సెల్ ఇమేజ్ సెన్సార్ ఉంది.

కనెక్టివిటీలో ఒప్పో ఏ31 4జి‌ / ఎల్‌టి‌ఈ, వై-ఫై, బ్లూటూత్ 5.0 కి సపోర్ట్ ఇస్తుంది. అదనంగా, మైక్రో యూ‌ఎస్‌బి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios