అఫ్ఫోర్డబుల్ ఆడియో, ఆడియో అసెసోరిస్ తయారీదారు నాయిస్  బ్రాండ్ ట్రు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లకు చాలా  ప్రసిద్ధి చెందింది.ఏదేమైనా నాయిస్ బ్రాండ్  సంస్థ తన ట్యూన్ రేంజ్ లో  భాగంగా ఇప్పుడు కొత్త నెక్‌బ్యాండ్  బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లను ప్రవేశపెడుతుంది. నాయిస్ బ్రాండ్ నుండి బ్లూటూత్ నెక్‌బ్యాండ్ ఇయర్ ఫోన్స్ క్వాల్కమ్ సివిసి 8.0 నాయిస్ కంట్రోల్ టెక్నాలజితో  వస్తుంది. 

also read వోడాఫోన్ నుండి కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌...ఇక ఉచిత కాల్స్....

నాయిస్  సంస్థ నుండి కొత్త  ప్రాడక్ట్ నాయిస్ ట్యూన్ ఫ్లెక్స్  బ్లూటూత్ నెక్‌బ్యాండ్ హెడ్‌సెట్ ఇండియాలో లాంచ్ చేసింది. ప్రస్తుతం దీని ధర రూ. 2,199.నాయిస్ ట్యూన్ ఫ్లెక్స్ ఇయర్‌ఫోన్‌లు ఇప్పుడు మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇంకా బ్రాండ్ సొంత ఇ-స్టోర్, గోనోయిస్.కామ్‌లో దీనిని కొనుగోలు చేయవచ్చు.

నాయిస్ ట్యూన్ ఫ్లెక్స్ క్వాల్కమ్ సివిసి 8.0 టెక్నాలజీతో వస్తుంది. ఇది వాయిస్ కాల్స్‌లో సౌండ్ క్వాలిటీని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.ఈ డివైజ్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0 ను కలిగి ఉంది. డ్యుయల్ పేర్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. హెడ్‌సెట్‌ను రెండు డివైజ్లతో ఏకకాలంలో ఉపయోగించవచ్చు మరియు వాటర్ ప్రుఫ్ రెసిస్టంట్ కోసం IPX5 రేటింగ్ కూడా చేయబడింది.

also read స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ రియల్‌ మి డేస్ సేల్ ఆకర్షణీయమైన ఆఫర్లు...

హెడ్‌సెట్ 10 ఎంఎం డైనమిక్ డ్రైవర్లను ఇందులో ఉపయోగించారు. ఒక్కసారి ఫుల్ చార్జ్  చేస్తే 12 గంటల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌లు, డివైజ్లకు  కనెక్ట్ అయినప్పుడు యూజర్లు అదనంగా నాయిస్ ట్యూన్ ఫ్లెక్స్‌లో ఆపిల్ సిరి, గూగుల్ అసిస్టెంట్‌ను ఉపయోగించవచ్చు.

ఇయర్‌ఫోన్‌లు సౌకర్యం కోసం అనువైన నెక్‌బ్యాండ్‌ను దీనికి ఉంది. స్పేస్ గ్రే, టీల్ గ్రీన్, బ్రోంజ్ గ్రే వంటి మూడు కలర్లలో లభిస్తాయి. ప్లేబ్యాక్, వాల్యూమ్, కాల్స్ కోసం నెక్‌బ్యాండ్‌లో కంట్రోల్ బటాన్స్ కూడా ఉన్నాయి.నాయిస్  బ్రాండ్ ఆన్‌లైన్‌లో ఒక ప్రముఖమైన బ్రాండ్, ప్రత్యేకించి చెప్పాలంటే దాని రేంజ్ ట్రు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు, నాయిస్ షాట్స్ X3, నాయిస్ షాట్స్ X- బడ్స్‌తో సహా ఫిట్‌నెస్ ట్రాకర్లు, స్మార్ట్ వాచీలు, యాక్షన్ కెమెరాలు, మొబైల్ అసెసోరిస్ కూడా కంపెనీ తయారు చేసి విక్రయిస్తుంది.