భారత మార్కెట్లో మోటో ‘జీ7’ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించే సమయం వచ్చేసింది. ఖచ్చితంగా సమాచారం వెల్లడించకున్నా సోమవారం సాయంత్రానికి మోటో జీ7 ఫోన్ ఆవిష్కరణ ఖాయంగా కనిపిస్తోంది. ఈ జీ7 ఫోన్‌ను గత నెలలోనే బ్రెజిల్‌లో ఆవిష్కరించారు. మోటో జీ7 ప్లే, మోటో జీ 7 ప్లస్ వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. 

భారతదేశంలో మోటో జీ ఫోన్ ధర 299 డాలర్లు (రూ.20.700)గా నిర్ణయించొచ్చు. అయితే అన్ని వర్గాల వినియోగదారులకు అనుగుణంగా నిర్ణయించొచ్చు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ఫార్మాట్లలో ఫోన్ లభిస్తుంది. సిరామిక్ బ్లాక్, క్లియర్ వైట్ కలర్స్‌లో మోటో జీ 7 ఫోన్ లభిస్తుంది. 

మోటో జీ 7 స్పెషికేషన్స్ ఇవే: 
- 3డీ గ్లాస్‌పై పీ2ఐ వాటర్ రీపిల్లెంట్ కోటింగ్ లేయర్.
- 1080x2270 పిక్సెల్స్ సామర్థ్యం గల డ్యూయల్ సిమ్ ప్యాక్ 
-  6.24 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే  
-  మాక్స్ విజన్ డిస్ ప్లే విత్ 19:9 యాస్పెక్ట్ రేషియో, 403 పీపీై పిక్సెల్ డెన్సిటీ
-  గొరిల్లా గ్లాస్ 3 కార్నింగ్ తో కవరింగ్ లేయర్
-  ఓక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్, 632 ఎస్వోసీ, 1.8జీహెచ్‌జడ్ అండ్ 4జీబీ రామ్
-  12 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్/1.8 అపెర్చర్ తోపాటు డ్యూయల్ రేర్      కెమెరా. 
-  5 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఎఫ్/2.2 అపెర్చర్ తోపాటు 8 మెగా పిక్సెల్     కెమెరా (సెల్ఫీ కెమెరా)
- 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం, మైక్రో ఎస్డీ కార్డుతో 512 జీబీ వరకు విస్తరణకు అవకాశం

ఇంకా 4జీ వోల్టె, బ్లూటూత్ వీ 4.2, వై-ఫై 802.11. ఏ /బీ/ జీ/ ఎన్, జీపీఎస్ /  ఎ-జీపీస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 15 వాట్ల మేరకు వేగంగా చార్జింగ్ సామర్థ్యం గల 3000 ఎంఎహెచ్ బ్యాటరీ ఉంటాయి.