చైనీస్ మల్టీ నేషనల్  కంపెనీ అయిన లెనోవా ఇప్పుడు ఒక కొత్త  వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ 'హెచ్‌డి 116' పేరుతో భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ .2,499కు అందిస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్‌ సైట్ ద్వారా  ఈ హెడ్‌ఫోన్‌లు  భారతీయ కస్టమర్ల కోసం అందుబాటులో ఉన్నాయి. త్వరలో ఈ నెల చివరిలోగా  ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కూడా అందుబాటులోకి కంపెనీ  తిసుకొస్తుంది.

also read  8 జీబీ స్టోరేజ్ తో ఆకట్టుకుంటున్న ఒప్పో స్మార్ట్‌ వాచ్‌...

"ఈ కొత్త హెడ్ ఫోన్స్ క్లాసిక్ స్టర్ది లుక్, సుపీరియర్ క్వాలిటీ, గొప్ప సౌండ్ అవుట్పుట్, స్ట్రాంగ్ బ్లూటూత్ కనెక్టివిటీ అందిస్తుంది" అని షెన్‌జెన్ ఆడిషి టెక్నాలజీ లిమిటెడ్‌లోని ఇంటర్నేషనల్ బిజినెస్ సిఇఒ జిసిసెంచు అన్నారు.  

లెనోవా కంపెనీ ప్రకారం, హెడ్‌ఫోన్ డ్యూయల్ ఇక్యూ మోడ్‌తో పని చేస్తుంది. ఇందులో స్టాండర్డ్ మోడ్ కూడా ఉంది. ఒక్కసారి  బటన్‌ను నొక్కతే చాలు మీరు ఇందులో ఉన్న రెండు మోడ్‌ల మధ్య మారడానికి అనుమతిస్తుంది. హెడ్‌ఫోన్ 240గంటలపాటు స్టాండ్‌బైతో 24 గంటల మ్యూజిక్ ప్లే బ్యాక్ ఇస్తుందని తెలిపింది.

also read త్వరలో పెరుగనున్నా మొబైల్ డేటా చార్జీలు...టెలికం శాఖ ఆదేశం?!

"2019లో లెనోవా నుండి ఇంతకుముందు భారతదేశంలో లాంచ్ చేసిన ఆడియో డివైజెస్ కు మంచి స్పందన వచ్చిన తరువాత, ఆడియో డివైజ్ అప్‌గ్రేడ్ వేర్షన్ ఇన్ బిల్ట్ ఇక్యూ టెక్నాలజీని తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాము" అని ఆడిషి టెక్నాలజీ లిమిటెడ్ హెడ్ ఇండియా బిజినెస్ నవీన్ బజాజ్ తెలిపారు.