Asianet News TeluguAsianet News Telugu

చైనాలో తగ్గిన ఐ ఫోన్‌ 11 సేల్స్.. షాంఘై, బీజింగ్ స్టోర్స్ వెలవెల

చైనాలో ఆపిల్ ఫోన్ల విక్రయానికి ‘హువావే’ ఎఫెక్ట్ బాగానే పడినట్లు కనిపిస్తోంది. హువావే ఫోన్ మాత్రమే కొనుగోలు చేయాలని చైనా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో షాంఘై, బీజింగ్‌ల్లోని ఆపిల్ షోరూమ్‌ల్లో వినియోగదారుల్లేక వెలవెలపోతున్నాయి. 

iPhone11 Hit Stores In China To No Crowds
Author
Washington D.C., First Published Sep 22, 2019, 12:36 PM IST

అమెరికా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఆపిల్‌కు చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీల సెగ బాగా తగులుతోంది. ఈ క్రమంలోనే మొబైల్‌ రంగంలో విప్లవం సృష్టించిన ఆపిల్‌ ఐఫోన్‌.. హువావే రాకతో కాస్త తడబడినట్లు తెలుస్తోంది. శుక్రవారం చైనీస్‌ మార్కెట్లో విడుదలైన ఐఫోన్ ‌11 అమ్మకాలలో కాస్త వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. 

వివో, ఒప్పో ఉన్నా హువావే వల్లే తగ్గిన ఆపిల్ సేల్స్
చైనా చౌక బ్రాండ్లయిన వివో, ఒప్పో ప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నా ఆపిల్‌ అమ్మకాలు పడిపోవడానికి హువావే ముఖ్య కారణమని టెక్నాలజీ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. న్యూషిప్‌మెంట్‌ రిపోర్ట్‌  2019 ప్రకారం తొలి త్రైమాసికంలో ఆపిల్‌ అమ్మకాలు చైనాలో 30శాతం మేర తగ్గినట్లు నివేదిక స్పష్టం చేస్తుంది. 

హోలోగ్రామ్ ఫోన్ లేదా 5జీ నెట్ వర్క్ అందుబాటులోకి వస్తేనే జోష్
ప్రస్తుత పరిస్థితులలో ఆపిల్‌ పుంజుకోవాలంటే హోలోగ్రామ్‌ ఫోన్‌ లేదా 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి తీసుకొస్తేనే మునుపటి మాదిరి అమ్మకాలు కొనసాగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే చైనాలో ఐఫోన్‌ మందగమనానికి అమెరికా, చైనా వాణిజ్యపరమైన యుద్ధాలు ఒక కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. చైనీయులు లోకల్‌ బ్రాండయిన హువాయ్‌వైపే మొగ్గు చూపుతున్నారని, అయితే 5జీ వస్తే యాపిల్‌ అమ్మకాలు పుంజుకోవచ్చని ఆర్థిక నిపుణుడు మిశ్రా తెలిపారు.

హువావే విక్రయాలపై చైనా సర్కార్ ఇలా
చైనా ప్రభుత్వం హువావేనే వాడాలని ఆదేశించడం, సరికొత్త ఫ్యూచర్స్‌తో అలరించడం తదితర పరిణామాలు హువావే పుంజుకోవడానికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు.

ఈ క్రమంలో ప్రపంచంలో 30శాతం గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లను చైనా కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. కానీ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలలో 16 శాతం క్షీణతను చెనా ఎదుర్కొంటున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 

ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపర్చిన యాపిల్‌ సీఈవో
ఆపిల్‌  సీఈవో టిమ్ కుక్‌  కాలిఫోర్నియా ప్రధాన కార్యాలయంలో అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. శుక్రవారం ఉదయం  అనూహ్యంగా ఆపిల్‌ ప్రధాన కార్యాలయం, ఐకానిక్‌ గ్లాస్‌ క్యూబ్‌లోకి  ప్రవేశించారు. దీంతో అభిమానుల సందడి నెలకొంది.

కొత్త ఐ ఫోన్‌ 11   స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడానికి వచ్చిన అభిమానులు టిమ్‌ కుక్‌తో సెల్ఫీదిగేందుకు బారులు తీరారు. 

కస్టమర్లతో ఇలా టిమ్ కుక్ పలకరింపులు 
అటు కొత్త ఫోన్‌ కోసం తెల్లవారుజాము నుండి లైన్లో ఉన్న వందల మంది కస్టమర్లను టిమ్‌ కుక్ పలకరించారు. వారికి హై ఫైలు ఇస్తూ సెల్పీలు దిగుతూ ఆకట్టుకున్నారు.

రెండున్నరేళ్లుగా మూసివేసిన ఈ ఆఫీసును పూర్తి హంగులతో ఐదవ అవెన్యూ స్టోర్ అసలు 32వేల చదరపు అడుగుల స్థలాన్ని 77వేల  చదరపు అడుగులకు రెట్టింపు చేశారు. రెన్‌బో కలర్స్‌ దీన్ని అత్యంత సొగుసుగా తీర్చి దిద్దారు. 

32 అడుగుల గ్లాస్ క్యూబ్ ఈ నెల మొదట్లో ప్రారంభం
32 అడుగుల గ్లాస్ క్యూబ్‌ను ఈ నెల ప్రారంభంలో తిరిగి ప్రారంభించారు. ఇది 24 గంటలు, 365 రోజులు  వినియోగదారులకు అందుబాటులో ఉండే ఆపిల్‌ స్టోర్‌ ఇదేనట.

కాగా ఇటీవల ఆపిల్‌ హెడ్‌క్వార్టర్స్‌ క్యుపర్టినోలోని స్టీవ్‌ జాబ్స్‌ ఆడిటోరియంలో ఐఫోన్‌ 11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్‌ అధునాతన స్మార్ట్‌ఫోన్‌లను జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.  

స్పెషల్‌ ఆడియో, డాల్బీ అట్మోస్‌ ఫీచర్, ఇరువైపులా 12 మెగాపిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 6.1 లిక్విడ్‌ రెటినా డిస్‌ప్లే, స్లో మోషన్‌ సెల్ఫీలు, ఏ13 బయోనిక్‌ చిప్‌ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఐఫోన్‌ 11 ధర 699 డాలర్ల నుంచి ప్రారంభం అవుతుంది. 
    iPhone11 Hit Stores In China To No Crowds

Follow Us:
Download App:
  • android
  • ios