ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ ఏదో తెలుసా...?

ఐఫోన్  ఎక్స్‌ఆర్  స్మార్ట్‌ఫోన్  విజయం ద్వారా స్పష్టంగా అందరికీ అర్ధమైంది. వినియోగదారులు అధిక రిఫ్రెష్ రేట్లు, క్వాడ్-కెమెరా సెటప్‌, స్క్రీన్‌ల గురించి పట్టించుకోరు అని మరో సారి రుజువైంది.మూడవ త్రైమాసికాల్లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ గా నిలిచింది.
 

iphone xr is the best selling smart phone in world

ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌ఆర్ స్మార్ట్ ఫోన్ చాలా ప్రజాదరణ పొందిన స్మార్ట్ ఫోన్. ఇది 2019 మూడవ త్రైమాసికంలో అన్నీ ఇతర స్మార్ట్‌ఫోన్లను మించిపోయింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అంచనా ప్రకారం ఐఫోన్ ఎక్స్‌ఆర్ స్మార్ట్ ఫోన్ మొదటి, రెండవ ఇంకా మూడవ త్రైమాసికాల్లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ గా నిలిచింది.

ఇది అన్ని మార్కెట్లలో కూడా అత్యధికంగా అమ్ముడైన బెస్ట్ ఐఫోన్. మార్కెట్ షెర్స్ ప్రకారం ఐఫోన్ ఎక్స్‌ఆర్ మొత్తం ప్రపంచ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 3 శాతం వాటాను కలిగి ఉంది.గత సంవత్సరం ప్రకటించిన ఐఫోన్ ఎక్స్‌ఆర్ చాలా మందికి కొత్త ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ కావడానికి ఒక కారణంగా నిలిచింది. పర్ఫార్మన్స్ పరంగా,  టాప్-ఎండ్ స్పెసిఫికేషన్లను ఈ ఫోన్ వినియోగదారులకు అందించింది.

also read లేటెస్ట్ టెక్నాలజితో కొత్త మల్టీ ఫంక్షనల్ ఫ్యాన్...

ఐఫోన్ ఎక్స్‌ఆర్  సక్సెస్ తర్వాత సగటు వినియోగదారులు అధిక రిఫ్రెష్ రేట్లు, క్వాడ్-కెమెరా సెటప్‌, స్క్రీన్‌లపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు.  ఇతర ప్రధాన మార్కెట్లలోనే కాదు ఐఫోన్ ఎక్స్‌ఆర్ భారతదేశంలో కూడా మంచి పర్ఫార్మన్స్ కనబరిచింది. ఆపిల్ అధికారికంగా ఐఫోన్ ఎక్స్‌ఆర్‌ను 49,990 రూపాయలకు రిటైల్ చేస్తుంది. క్యాష్‌బ్యాక్ ద్వారా రూ .45,000 కు అందుబాటులో ఉంది. 


అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఐఫోన్ 11, రెడ్‌మి 7 ఎ. ఐఫోన్ ఎక్స్‌ఆర్ కాకుండా ఐఫోన్ 11 కూడా మొదటి పది జాబితాలో చోటు దక్కించుకుంది. 2020 నాటికి ఐఫోన్ XR ను ప్రజాదరణ పొందితే ఆశ్చర్యపోనవసరం లేదు. ఐఫోన్  11 64GB స్టోరేజ్ మోడల్ ప్రస్తుతం దీని ధర రూ .64,900 వద్ద ప్రారంభమవుతుంది.

iphone xr is the best selling smart phone in world


2019 మూడవ త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌లు:


1.) ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌ఆర్

2.) శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 10

3.) శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 50

also read  అతి తక్కువ ధరకే రియల్​ మీ కొత్త స్మార్ట్ ఫోన్...అదిరే ఫీచర్లతో...

4.) ఒప్పో A9

5.) ఆపిల్ ఐఫోన్ 11

6.) ఒప్పో A5s

7.) శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 20

8.) ఒప్పో A5

9.) షియోమి రెడ్‌మి 7 ఎ

10.) హువావే పి 30


ఆపిల్ వచ్చే ఏడాది మరో ఐదు ఐఫోన్‌లను విడుదల చేయలనుకుంటుంది. వీటిలో నాలుగు 5 జి-ఎనేబుల్డ్ హై-ఎండ్ మోడల్స్, ఐఫోన్ 2016 ఎస్‌ఇ మోడల్ కి సీక్వెల్ రానుంది. గత సంవత్సరం ఆపిల్ మూడు ఐఫోన్ మోడళ్లను సెప్టెంబర్‌లో ప్రారంభించింది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios