స్మార్ట్ ఫోన్స్ రంగంలో ప్ర‌ముఖ బ్రాండ్ పేరొందిన హాన‌ర్ ఇప్పుడు కొత్తగా రెండు మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ల‌ను విడుదల చేసింది. హాన‌ర్ 9 ఎక్స్‌లైట్‌, హాన‌ర్ 20ఈ అనే రెండు మోడ‌ల్స్ ను అధికారికంగా  లాంఛ్ చేసింది.

ప్రస్తుతం ఉన్న జనరేషన్లో కొత్త లేటెస్ట్ ఫీచర్లను జోడించి వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగానే హాన‌ర్ బ్రాండ్ మార్కెట్లో విస్తృతంగా వ్యాపించడానికి ఈ స్మార్ట్ ఫోన్లలోను అందుబాటులోకి తీసుకొచ్చాయి. 

హాన‌ర్  20ఈ స్పెసిఫికేష‌న్లు, ఫీచర్లు గ‌తేడాదిలో విడుద‌లైన హాన‌ర్ 20 లైట్ త‌ర‌హాలోనే ఉన్నాయి. హాన‌ర్ 9 ఎక్స్‌లైట్, హాన‌ర్ 20ఈ ఫోన్లలో ఆక్టాకోర్ ప్రాసెస‌ర్ల‌ను అందించ‌డంతో పాటు 4జీబీ ర్యామ్‌ను దీనిలో ఉంది.

హానర్ 9 ఎక్స్‌లైట్ స్మార్ట్ ఫోన్ బ్యాక్  సైడ్ (వెన‌క‌వైపు)డ్యుయ‌ల్ కెమెరాలు ఉండగా హాన‌ర్ 20ఈ లో ట్రిపుల్ కెమెరాను అందిస్తున్నారు.

హాన‌ర్ 9 ఎక్స్ లైట్ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేష‌న్లు ఇందులో కేవ‌లం ఒక్క వేరియంట్ మాత్ర‌మే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో ఈ వేరియంట్ అందుబాటులోకి రానుంది.

ఈ మోడ‌ల్ ధ‌ర‌ 199 యూరోలు అంటే సుమారుగా రూ.16,400గా నిర్ణ‌యించారు. బ్లాక్, గ్రీన్ రెండు క‌ల‌ర్స్ లో మాత్రమే  హాన‌ర్ 9 ఎక్స్‌లైట్  ఉండ‌నున్న‌ట్లు ఫిన్ లాండ్ లో ఉన్న డిస్ట్రిబ్యూట‌ర్ పేజీలో పేర్కొన్నారు.

హాన‌ర్ 9 ఎక్స్ లైట్ స్మార్ట్ ఫోన్ సేల్స్ మే 14 నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రీ ఆర్డ‌ర్లు ఏప్రిల్ 30వ తేదీ నుంచి మొదలవుతాయి. 

హానర్  20ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేష‌న్లు ఇందులో  4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ అందుబాటులోకి రానుంది. ఈ మోడ‌ల్‌ ధరను సుమారు 180 యూరోలు అంటే రూ.14,800 గా నిర్ణయించారు. హాన‌ర్  20ఈ స్మార్ట్ ఫోన్ మిడ్ నైట్ బ్లాక్, ఫాంటమ్ బ్లూ క‌ల‌ర్స్ లో మాత్రమే అందిస్తున్నారు.  

హానర్ కంపెనీ ఇటలీ వెబ్ సైట్ లో హానర్ 20ఈ స్మార్ట్ ఫోన్ లిస్ట్ చేశారు అయితే ఈ మోడ‌ల్ కు సంబంధించి సేల్స్  ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుంద‌నే విష‌యంపై ఎలాంటి సమాచారం లేదు. భార‌త్ లో ఈ ఫోన్లు ఎప్పుడు లాంఛ్ అవుయీ  అనే సమాచారం కోసం వేచి చూడాల్సింది.