బడ్జెట్ ధరలోనే జియోనీ ఎఫ్9 ప్లస్
పండుగల సీజన్ వస్తుండటంతో వివిధ సంస్థలు నూతన ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగా జియోనీ సంస్థ భారత విపణిలోకి ‘ఎఫ్9 ప్లస్’ మోడల్ ఫోన్ ను విడుదల చేసింది. రూ.7690లకే ఈ ఫోన్ లభ్యం కానున్నది.
ముంబై: ప్రముఖ మొబైల్ సంస్థ జియోనీ భారత విపణిలోకి చౌక ధరకే సరికొత్త స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. ఎఫ్ 9 ప్లస్ పేరుతో ఆవిష్కరించిన ఈ ఫోన్ భారీ డిస్‌ప్లే, బ్యాటరీ, డ్యుయల్ రియర్ కెమెరా తదితర అద్భుత ఫీచర్లు కలిగి ఉంది.
6.26-అంగుళాల హెచ్‌డి + ఫుల్ వ్యూ డిస్‌ప్లే గల ఈ ఫోన్ వాటర్‌డ్రాప్ నాచ్‌తో ఫీచర్ కలిగి ఉండి. వినియోగదారులకు రూ.7,690లకే ఈ ఫోన్ లభించనున్నది.
1.65 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ గల ఈ ఫోన్ ‘ఆండ్రాయిడ్ 9.0పై’ తో పని చేస్తుంది. 3 జీబీ ర్యామ్ విత్ 32 జీబీ ర్యామ్ స్టోరేజ్ సామర్థ్యం ఈ ఫోన్ సొంతం. ఇంకా 13 +2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా, 13ఎంపీ సెల్ఫీ కెమెరాలతోపాటు 4050 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ అమర్చారు.
వినియోగదారుల మారుతున్న ప్రాధాన్యాలకు అనుగుణంగా బ్రాండ్లు అభివృద్ధి చెందాలని జియోనీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ జైన్ చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, మారుతున్న ధోరణులకనుగుణంగా ఉత్పత్తులు ఉండాలన్నారు.
ముఖ్యంగా కస్టమర్ల స్పష్టమైన అభిరుచిని చేరుకునేందుకు జియోనీ ఎల్లపుడూ ప్రయత్నిస్తుందని ప్రదీప్ జైన్ తెలిపారు. అంతేకాదు ఈ స్మార్ట్‌ఫోన్‌తోపాటు, జియోనీ ‘జీబడ్డీ’ పేరుతో కొత్త సబ్ బ్రాండ్‌ను కూడా ప్రకటించింది. ఈ బ్రాండ్ కింద వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్, వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ హెడ్‌సెట్, ఇయర్‌ఫోన్స్, పవర్ బ్యాంక్‌లను ఆవిష్కరించింది.