శామ్‌సంగ్, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (United Nations Development Program )సంయుక్తంగా రూపొందించిన శామ్‌సంగ్ గ్లోబల్ గోల్స్ (ఎస్‌జీజీ) (Samsung Global Goals App) యాప్ ద్వారా మీ మనసుకు నచ్చిన అంశాలపై స్పందించవచ్చు. 

మీరు మీ కమ్యూనిటీలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారా.. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా దానిని ప్రారంభించాలో తెలియడం లేదా..? ఇలాంటి వారికి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శామ్‌సంగ్ (Samsung) వేదిక కల్పించింది. శామ్‌సంగ్, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (United Nations Development Program )సంయుక్తంగా రూపొందించిన శామ్‌సంగ్ గ్లోబల్ గోల్స్ (ఎస్‌జీజీ) (Samsung Global Goals App) యాప్ ద్వారా మీ మనసుకు నచ్చిన అంశాలపై స్పందించవచ్చు. 

బాలీవుడ్ నటి అలియా భట్.. (Alia Bhatt) తన శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ (Galaxy Z Series ) ద్వారా శామ్‌సంగ్ ఇండియా (Samsung India ) కోసం పనిచేస్తున్నారు. గెలాక్సీ వినియోగదారులు.. యువతులకు విద్య, పాఠశాల పిల్లలకు ఆహారం, పిల్లల హాక్కులను కాపాడటం, పేదరికానికి వ్యతిరేకంగా మద్ధతు పలకడం, కోవిడ్ బారినపడిన కుటుంబాల్లో నష్టాన్ని తగ్గించడంలో సాయంచేయడం వంటి అభివృద్ధి కార్యక్రమాలకు విరాళం ఇవ్వొచ్చని శామ్‌సింగ్ తెలిపింది. ఇందుకు సంబంధించిన చెల్లింపులను యూపీఐ ద్వారా చేయవచ్చని వెల్లడించింది. 

ఈ సందర్భంగా అలియా భట్ మాట్లాడుతూ.. గ్లోబల్ లక్ష్యాలకు సాయం చేయడంతో పాటు సాంకేతికత సాయంతో మార్పును తీసుకురావడానికి ప్రజలకు అందుబాటులో వుండేలా శామ్‌సంగ్‌తో కలిసి పనిచేయడం తనకు గర్వంగా వుందన్నారు. శామ్‌సంగ్ గ్లోబల్ గోల్స్ యాప్ ద్వారా భారతదేశానికి సంబంధించిన సమస్యల కోసం నిధులను సేకరించేందుకు తాము గ్లోబల్ యాప్‌ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. 

Also Read:శామ్‌సంగ్ అత్యంత పవర్ ఫుల్ 5జి స్మార్ట్‌ఫోన్.. గెలాక్సీ ఎం సిరీస్‌ కింద లాంచ్..

శామ్‌సంగ్ తీసుకున్న ఈ చొరవ.. ప్రజలను ఒక చోటుకి చేర్చడంలో సహాయపడుతుంది. గెలాక్సీ వినియోగదారులను అర్ధవంతమైన సామూహిక మార్పుకు, సామాజికంగా ఎక్కువ మంచిని సాధించే చిన్నపాటి వ్యక్తిగత చర్యలను తీసుకోవడం ద్వారా ప్రభావం చూపమని ప్రోత్సహిస్తుంది. శామ్‌సంగ్ ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన సవాళ్లను పరిష్కరించడానికి టెక్నాలజీని వినియోగిస్తోందని.. అప్‌డేట్ చేసిన శామ్‌సంగ్ గ్లోబల్ గోల్స్ యాప్ ప్రస్తుతం భారతదేశంలోని గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులతో సహా ప్రపంచం మొత్తం అందుబాటులోకి రానుందని శామ్‌సంగ్ ఇండియా కార్పోరేట్ సిటిజన్‌షిప్ వైస్ ప్రెసిడెంట్ హెడ్ పార్థ ఘోష్ అన్నారు. ఈ కొత్త యాప్ డిజిటల్ ఇండియాలో తమ భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని ఆయన చెప్పారు. 

యూఎన్‌డీపీ, శామ్‌సంగ్ భాగస్వామ్యంతో భారత్‌లో ఎక్కువ మందిని సుస్ధిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి వ్యక్తిగత చర్యలు తీసుకోవడానికి స్పూర్తినిస్తుందని యూఎన్‌డీపీ ఇండియా రెసిడెంట్ ప్రతినిధి షోకో నోడా అన్నారు. సమిష్టి ప్రభావాన్ని ప్రారంభించడానికి సాంకేతిక ఆవిష్కరణలు చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. 

వినియోగదారులు యూఎన్‌డీపీకి (undp) ఆదాయాన్ని సృష్టించడానికి శామ్‌సంగ్ గ్లోబల్ గోల్స్ యాప్‌ సహాయపడుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో వచ్చే యాడ్స్‌ను చూడటం ద్వారా యూఎన్‌డీపీకి ఆదాయం వచ్చేలా చేయవచ్చు. ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు వాల్‌ పేపర్స్‌ను ఉపయోగించడం ద్వారా మరింత తోడ్పాటును అందించవచ్చు. 2015లో అభివృద్ధి చేసిన ఈ యాప్‌కు.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (un general assembly) ద్వారా 17 గ్లోబల్ గోల్స్‌ను సెట్ చేశారు. అలాగే ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడటానికి ప్రపంచ వ్యాప్తంగా నాయకులు ఈ యాప్‌ను అంగీకరించారు. 2030 నాటికి అందరికీ మెరుగైన భవిష్యత్‌ను సాధించడానికి బ్లూ ప్రింట్ సైతం సిద్ధం చేశారు. 

ఇక శామ్‌సంగ్, యూఎన్‌డీపీ మధ్య భాగస్వామ్యంగా 2019లో ప్రాణం పోసుకున్న గ్లోబల్ గోల్స్ యాప్, గ్లోబల్ గోల్స్‌పై అవగాహన కల్పించడానికి సులభమైన మార్గాలను అందిస్తుంది. ప్రత్యక్ష విరాళాల ద్వారా లేదా ప్రకటనలలో పాలుపంచుకోవడం వంటి సులభమైన మార్గాల ద్వారా మార్పును సృష్టించడానికి ప్రజలకు అనుమతిస్తుంది. తాజా గణాంకాల ప్రకారం.. శామ్‌సంగ్ గ్లోబల్ గోల్స్ యాప్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 170 మిలియన్ల పరికరాలలో ఇన్‌స్టాల్ చేయబడింది. తద్వారా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఛారిటీ యాప్‌గా నిలిచింది. ఇప్పటి వరకు యాప్ గ్లోబల్ గోల్స్ 1.5 మిలియన్ డాలర్ల విరాళాలను సేకరించింది.