రూ.10,000ల్లో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్‌లివే
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు తమ అన్ని వర్గాల వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని వివిధ రకాలైన మొబైల్స్‌ను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. రూ. 10,000లలోపు మంచి పీచర్లతో ఇటీవల కాలంలో మొబైల్ కంపెనీలు చాలా ఫోన్లను విడుదల చేశాయి. వాటిలో జియోమీ నుంచి రెడ్‌మీ నోట్ 7 కూడా ఉంది.
స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు తమ అన్ని వర్గాల వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని వివిధ రకాలైన మొబైల్స్‌ను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. రూ. 10,000లలోపు మంచి పీచర్లతో ఇటీవల కాలంలో మొబైల్ కంపెనీలు చాలా ఫోన్లను విడుదల చేశాయి. వాటిలో జియోమీ నుంచి రెడ్‌మీ నోట్ 7 కూడా ఉంది.
రెడ్‌మీ నోట్ 7 తోపాటు ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ ఎం2, రియల్‌మీ యూ1 లాంటి మొబైల్స్ కూడా ఉన్నాయి. రూ.7000 నుంచి 10,000ల మధ్య రేటుతో లభిస్తున్న బెస్ట్ మొబైల్ ఫోన్స్ ఫీచర్లు కూడా బాగున్నాయి. వాటిని ఒకసారి పరిశీలిద్దాం..
Redmi Note 7
ఇటీవల కాలంలో అందుబాటు ధరలో భారత మార్కెట్లోకి ప్రవేశించిన మంచి ఫోన్లలో రెడ్‌మీ నోట్ 7 ఒకటని చెప్పవచ్చు. ప్రీమియమ్ డిజైన్, షార్ప్ డిస్‌ప్లే కలిగివుంది. మంచి బ్యాటరీ లైఫ్. ఫ్లైయింగ్ కలర్స్ తో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ 12.52గంటలపాటు హెచ్‌డీ వీడియో లూప్ టెస్ట్ ఎదుర్కొంది.
రెడ్‌మీ నోట్ 7.. 6.3 ఇంచ్ ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్ ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్, కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగివుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ఆక్టాకోర్ చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 9పై ఆపరేషన్ సిస్టమ్ తోపాటు MIUI 10 కస్టమైజేషన్ కలిగివుంది.
రెడ్‌మీ నోట్ 7 రెండు వేరియెంట్లలో లభిస్తోంది. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీతో ఒకటి, 4జీబీ ర్యామ్, 64జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీతో మరొకటి అందుబాటులో ఉన్నాయి. 12ఎంపీ+12ఎంపీ డ్యూయెల్ బ్యాక్ కెమెరాలను కలిగివుంది. 13మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా ఉంది. 4000ఎంఏహెచ్ బ్యాటరీతో వేగవంతమైన ఛార్జింగ్.
రియల్ మీ యూ1(Realme U1)
రూ.15,000 ధరలో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న రియల్ మీ యూ1
ఇప్పుడు ధరలు తగ్గడంతో రూ.10,000 ధరల విభాగంలోకి వచ్చేసింది. ఈ ఫోన్ మంచి డిజైన్లలో లభిస్తోంది. హెలీయో పీ70ఎస్ఓసీ కలిగివుంది. మంచి బ్యాటరీ లైఫ్ కూడా ఉంది. మంచి లైటింగ్ ఉంటే.. డ్యూయెల్ కెమెరాతో మంచి క్వాలిటీ ఫొటోలు తీసుకోవచ్చు.
రియల్ మీ యూ1 రెండు వేరియెంట్లలో లభిస్తోంది. 3GB + 32GB తోపాటు 4GB + 64GB. ఇందులో ఒకటి మాత్రమే రూ.10,000 ధరల విభాగంలో అందుబాటులో ఉంది. ఏప్రిల్ 10 నుంచే 3జీబీ, 64జీబీ వేరియెంట్‌పై డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. కాగా, ఇందులో ఫింగర్‌ప్రింట్స్ స్మడ్జెస్ అనేది కొంత సమస్యగా ఉంది.
Nokia 5.1 Plus
ఇటీవల కాలం వరకు రూ.15,000 ధరల విభాగంలో టాప్ బెస్ట్ స్మార్ట్ ఫోన్‌గా హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 5.1ప్లస్.. ఇప్పుడు ధరలు తగ్గడంతో రూ.10,000 విభాగంలోకి వచ్చేసింది. ఆండ్రాయిడ్ వన్ ప్లాట్‌ఫాంతోపాటు ఆకర్షణీయమైన డిజైన్ కలిగివుంది. మంచి బ్యాటరీ లైఫ్ కూడా ఉంది.
నోకియా 5.1ప్లస్ ఫోన్ డ్యూయెల్ కెమెరాలను కలిగివుంది. అయితే, ఈ కెమెరాలు ల్యాండ్‌స్కేప్ షాట్స్ బాగానే తీస్తున్నప్పటికీ.. ఆటో హెచ్‌డీఆర్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు క్లారిటీ అంతగా రావడం లేదు. ఎల్ఈడీ ఫ్లాష్ ఏరియాలో తొందరగా వేడెక్కుతున్నట్లు గమనించడం జరిగింది.
హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 5.1ప్లస్ ఫోన్లను రెండు వేరియెంట్లలో అందిస్తోంది. 3జీబీ, 32జీబీ ఒకటి కాగా, మరోటి 4జీబీ, 64జీబీ. ఈ రెండు వేరియెంట్లలో ఒకటి మాత్రమే రూ.10,000 ధరల విభాగంలోకి వస్తుంది.
Realme 3
రూ. 10,000 ధరల విభాగంలో లభిస్తున్న మరో స్మార్ట్ ఫోన్ రియల్‌మీ 3. మంచి డిజైన్ తోపాటు మంచి క్వాలిటీని కలిగివుంది. పవర్‌ఫుల్ ప్రాసెసర్ తో మంచి పర్ఫెర్మెన్స్ ఇస్తోంది. ఫ్రంట్ కెమెరాతోపాటు డ్యూయెల్ బ్యాక్ కెమెరాలను కలిగివుంది. కెమెరా క్వాలిటీ సాధారణంగా ఉంది.
బ్యాటరీ లైఫ్ బాగుంది. రియల్ మీ 3ని రెండు వేరియెంట్లలో అందిస్తోంది. 3జీబీ, 32జీబీ ఒకటి, మరోటి 4జీబీ, 64జీబీ. 3జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.10,000 ధరల విభాగంలో లభిస్తోంది.
Asus ZenFone Max M2
గత సంవత్సరంలో విడుదలైన స్మార్ట్ ఫోన్లలో ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ఎం2
కూడా ఒకటి. మంచి పర్ఫామెన్స్ తోపాటు బ్యాటరీ లైఫ్ కూడా బాగుంది. కాగా, ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ఎం2కు అప్ డేట్ వర్షన్ కూడా ఏప్రిల్ నెలలోనే విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.
కెమెరాల పనితీరు కూడా బాగుంది. అయితే వెలుతురు తక్కువగా ఉంటే మాత్రం క్లారిటీలో కొంత తేడా వస్తోంది. 3జీబీ, 32జీబీ వేరియెంట్ రూ.10,000 ధరల విభాగంలో అందుబాటులో ఉంది. మరో రూ. 500 వరకు ఎక్కువ పెట్టదల్చుకుంటే మాత్రం 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ఫోన్ కొనుగోలో చేయడం ఉత్తమం.
Nokia 3.1 Plus
హెచ్ఎండీ గ్లోబల్ నుంచి వచ్చిన మరో మంచి బడ్జెట్ ఫోన్ నోకియా 3.1. ఆండ్రాయిడ్ తోపాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయడంలో ఈ ఫోన్ రికార్డులకెక్కుతోంది. బ్యాటరీ లైఫ్ కూడా బాగుంది. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ వేరియెంట్ రూ.10,000 ధరల విభాగంలో అందుబాటులో ఉంది.
Lenovo K9
ఇప్పటికే లెనోవా చాలా బడ్జెట్ ఫోన్లు విడుదల చేసినప్పటికీ లెనోవా కే9 వీటిలో బెస్ట్ గా నిలిచింది. ఎక్కువ యాప్ లు కలిగి ఉన్నప్పటికీ ఈ ఫోన్ మంచి సామర్థ్యంతో పనిచేస్తోంది. బ్యాటరీ లైఫ్ కూడా బాగుంది. అయితే కెమెరా విషయంలోనే కొంత అసంతృప్తి. డే లైట్‌లో కూడా క్లారిటీ ఫొటోలు రావడం లేదు. ప్రస్తుతం 4జీబీ, 64జీబీ వేరియెంట్ మాత్రమే మనదేశంలో అందుబాటులో ఉంది.
Redmi 6 Pro
రెడ్‌మీ 6 ప్రో అనేది బడ్జెట్ స్మార్ట ఫోన్లలో ముందు వరుసలో ఉంది. 5.84 ఇంచ్ స్క్రీన్ కలిగిన ఈ ఫోన్ క్వాలిటీ బాడీతో రూపొందించబడింది. డ్యూయెల్ కెమెరాలు కలిగివున్న ఈ ఫోన్.. తీసే ఫొటోల క్వాలిటీ కూడా బాగుంది. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ వేరియెంట్ రూ.10,000 విభాగంలో అందుబాటులో ఉంది.
Infinix Note 5
ఇన్ఫినిటీ నోట్ 5.. ఆండ్రాయిడ్ వన్‌లో ఈ కంపెనీ నుంచి వచ్చిన తొలి స్మార్ట్ ఫోన్ ఇదే కావడం గమనార్హం. వైబ్రెంట్ స్క్రీన్ కలిగివుంది. మంచి బ్యాటరీ లైఫ్ తోపాటు మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తోంది. ఫొటో క్వాలిటీ సాధారణంగానే ఉంది. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ వేరియెంట్ రూ.10వేల ధరల విభాగంలో అందుబాటులో ఉంది.
Realme 2
రియల్‌మీ 2 మంచి బ్యాటరీ లైఫ్ కలిగివుంది. ఆకర్షణీయమైన డిజైన్‌తో ఉంది. కెమెరా క్వాలిటీ సాధారణంగానే ఉంది. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ వేరియెంట్ రూ.10వేల ధరలో లభిస్తోంది.
Asus ZenFone Max Pro M2
ఆసుస్ నుంచి వచ్చిన మరో బెస్ట్ ఫోన్ ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ప్రో ఎం2. క్లిస్పీ డిస్ ప్లేతో ఆకర్షణీయంగా ఉంది ఈ ఫోన్. పవర్ ఫుల్ ఎస్ఓసీని కలిగివుంది. స్టాక్ ఆండ్రాయిడ్‌తో మంచి పర్ఫామెన్స్ ఇస్తోంది. కెమెరా క్వాలిటీ సాధారణంగా ఉన్నప్పటికీ మిగితా విషయాల్లో ఈ ఫోన్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ కలిగివుంది.
3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ వేరియెంట్ రూ.10వేల ధరల విభాగంలో అందుబాటులో ఉంది.