Asianet News TeluguAsianet News Telugu

ఆపిల్ కంపెనీ దాదాపు... 28 సంవత్సరాల గ్యాప్ తరువాత...

జనవరి 7న  జరిగే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో ఆపిల్ ఎగ్జిక్యూటివ్ జేన్ హోర్వత్  వినియోగదారుల ప్రైవసీ ప్యానెల్‌లో మాట్లాడనున్నారు. ఆపిల్ కంపెనీ అరుదైన అధికారిక ప్రదర్శన ఇవ్వనున్నట్లు కుపెర్టినోకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ ధృవీకరించింది.

apple company after 28 years gap now joining in CES show 2020
Author
Hyderabad, First Published Jan 6, 2020, 12:37 PM IST

లాస్ వెగాస్‌లో జరగబోయే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సిఇఎస్) లో దాదాపు 28 సంవత్సరాల తరువాత ఆపిల్ కంపెనీ అరుదైన అధికారిక ప్రదర్శన ఇవ్వనున్నట్లు కుపెర్టినోకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ ధృవీకరించింది.ఈ కార్యక్రమంలో ఆపిల్ ఎగ్జిక్యూటివ్ జేన్ హోర్వత్ జనవరి 7న వినియోగదారుల ప్రైవసీ ప్యానెల్‌లో మాట్లాడనున్నట్లు ఒక పత్రికలో నివేదించింది.

also read ఆపిల్ నుండి రెండు కొత్త మోడళ్ స్మార్ట్ ఫోన్లు

 రేగులేషన్స్, వినియోగదారుల డిమాండ్ పరంగా కంపెనీలు ప్రైవసీ రక్షణలను ఎలా ఏర్పాటు చేయవచ్చో చర్చించడానికి ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టిసి) అధికారులతో పాటు ఫేస్‌బుక్ ప్రొక్టర్ ఇంకా గాంబుల్ ఎగ్జిక్యూటివ్‌లతో హోర్వత్  హాజరుకానున్నారు.

ఆపిల్  కంపెనీకి ఇండియన్ మార్కెట్లో పోటీదారులుగా ఉన్న అమెజాన్, గూగుల్  ఐయోటి-పవర్ తో  పనిచేసే డివైజ్లకు మరింత సామర్థ్యాలను చేకూర్చే కొత్త అప్ డేట్ లను విడుదల చేయనున్నందున కంపెనీ తన హోమ్‌కిట్ స్మార్ట్ హోమ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రదర్శిస్తుంది.

1992లో చికాగోలో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షోలో ఆపిల్ అధికారికంగా పాల్గొంది. అప్పటి సి‌ఈ‌ఓ జాన్ స్కల్లీ న్యూటన్ డివైజ్ విడుదల చేయడానికి ఒక  సమావేశంలో పాల్గొన్నాడు.ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కుయో ఇటీవల ఐఫోన్ తయారీదారు 2020 మూడవ త్రైమాసికంలో A14X చిప్‌తో హై-ఎండ్ 12.9-అంగుళాల ఐప్యాడ్ ప్రో, ఆరు కొత్త ఐఫోన్‌ల మోడళ్లను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.

also read సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్.... 48MP ట్రిపుల్ రియర్ కెమెరాతో..


ఆపిల్ ఐఫోన్ 12 మోడల్ 5జి వేరియంట్ అధునాతన ఇమేజ్ సెన్సార్-షిఫ్ట్ స్టెబిలైజేషన్ టెక్నాలజీతో రావచ్చు అని తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios