అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్స్ కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 11-13 వరకు స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. భారీ ఆఫర్లు, డిస్కౌంట్ ధరలతో వస్తున్న ఉత్తమ స్మార్ట్ ఫోన్లను ఇక్కడ కొనుగోలు చేసి మీ డబ్బును, సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.

అమెజాన్ 2019లో ఫ్యాబ్ ఫెస్ట్ నిర్వహించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై కూడా ఈ మూడు రోజులపాటు డిస్కౌంట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే ఒక రోజు ముగియగా.. నేటితో మరో రెండ్రోజులే మిగిలాయి.

అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్: బెస్ట్ ఆఫర్లు వీటిపైనే..

యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్(Apple iPhone XR): 

అమెజాన్ ఇండియాలో భారీ డిస్కౌంట్ ప్రకటించడంతో కొద్ది గంటల్లోనే యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ స్టాక్ మొత్తం అయిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ అందుబాటులోకి వచ్చింది. రూ.76.900 విలువ గల 64జీబీ గల ఐఫోన్ ఎక్స్ఆర్ ఫ్యాబ్ ఫెస్ట్‌లో రూ. 59,900లకే లభిస్తోంది.

ఇదిఇలావుంటే ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్‌ను హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 10శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ అందుతోంది. 10శాతం అంటే రూ.7,500 వరకే పరిమితి. ఐఫోన్ 6ఎస్ మోడల్ పై కూడా ఇదే ఆఫర్ ఉంది. ఇన్‌స్టాంట్‌తో ఐఫోన్ ఎక్స్ఆర్ రూ. 54,630 పొందవచ్చు.

ధర: రూ. 59,990( MRP Rs. 76,900))

వన్‌ప్లస్ 6టీ(OnePlus 6T)

వన్‌ప్లస్ 6టీపై అమెజాన్ ఇండియాలో ఫ్యాబ్ ఫెస్ట్ మంచి డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఎమ్మార్పీ రూ. 37,999 గల 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వెరియేంట్ రూ.34,999కే లభిస్తోంది.  ఎమ్మార్పీ రూ. 41,999 గల  8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వెరియేంట్ వన్ ప్లస్ 6టీ డిస్కౌంట్‌తో రూ.37,999కే అమెజాన్‌లో లభిస్తోంది. 

ఇంకా సామర్థ్యం ఎక్కువ ఉన్న మొబైల్ కావాలంటే.. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ వేరియెంట్ వన్ ప్లస్ 6టీ ఇప్పుడు రూ.41,999కే అందుబాటులో ఉంది. దీని ఎమ్మార్పీ రూ. 45.999. దీనిపై ఎక్ఛేంజ్ ఆఫర్లు కూడా అందిస్తోంది. అంతేగాక, నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఇస్తోంది.

వీవో వీ15 ప్రో(Vivo V15 Pro)

వీవో వీ15 ప్రోపై కూడా డిస్కౌంట్ లభిస్తోంది. రూ.32,990గల ఈ మొబైల్ ఫెస్ట్ సందర్భంగా రూ. 28,990కే లభిస్తోంది. ఎక్ఛేంజ్ ఆఫర్ ఉపయోగించుకుంటే రూ.3వేలకుపైగా అదనపు డిస్కౌంట్ ఇస్తోంది. 

వీవో వీ15 ప్రో 6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ తోపాటు సూపర్ అమోల్డ్(AMOLED) డిస్‌ప్లే. 32 మెగా పిక్సెల్స్ పాప్ సెల్ఫీ కెమెరాతోపాటు మూడు రేర్ కెమెరాలను కలిగివుంది. వీవో వీ15 ప్రో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగివుంది.

ధర: రూ. 28,990-(ఎమ్మార్పీ రూ. 32,990)

హానర్ ప్లే(Honor Play)

హానర్ ప్లే మొబైల్ పై అమెజాన్ భారీ తగ్గింపును అందిస్తోంది. 4జీబీ, 64జీబీ హానర్ ప్లే మొబైల్ ఇప్పుడు రూ. 13,999కే లభిస్తోంది. దీని ఎమ్మార్పీ రూ.21,999గా వుంది. ఎక్చేంజ్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.11,450కే లభించే అవకాశం ఉంది.

హానల్ ప్లే ఫీచర్లను గమనించినట్లయితే.. 6.3ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, డ్యూయెల్ రేర్ కెమెరా సెటప్. హువావే కిరిన్ 970ఎస్ఓఎస్. 4జీబీ ర్యామ్. హువావే జీపీయూ టర్బో 2.0 టెక్నాలజీ కలిగివుంది. ఇది సూపరియర్  గేమింగ్ ఫర్ఫార్మెన్స్‌ కలిగివుంది.

ధర: రూ. 13,999(ఎమ్మార్పీ రూ. 21,990)

వీవో వై83 ప్రో(Vivo Y83 Pro)

రూ. 16,990 విలువ గల వీవో వై83 ప్రోని అమెజాన్ ఇప్పుడు కేవలం రూ. 11,990కే అందిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా చెల్లింపు చేపడితే అమెజాన్ పే బ్యాలెన్స్‌గా రూ. 1000ని అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్/క్రెడిట్ కార్డులతో చెల్లింపు చేపడితే అదనంగా 10శాతం(పరిమితిరూ.1500) తగ్గింపు లభిస్తోంది.

వీవో వై83 ప్రో ఫీచర్ల విషయానికొస్తే.. 6.22 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లే, మీడియా టెక్ హెలియో పీ22ఎస్ఓసీ, 4జీబీ ర్యామ్ సపోర్ట్. 3290ఎంఏహెచ్ బ్యాటరీ.

ధర: రూ. 11,990(ఎమ్మార్పీ రూ. 16,990)

హానర్ వ్యూ 20(Honor View 20)

డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా హానర్ వ్యూ 20 కొనుగోలు చేస్తే.. దీనిపై రూ. 3000 ఇన్ స్టాంట్ డిస్కౌంట్‌గా పొందవచ్చు. రూ. 42,999 విలువ గల ఈ మొబైల్ ఇప్పుడు రూ.34,999కే లభిస్తోంది. హానర్ వ్యూ20(6జీబీ, 128జీబీ) ఫోన్ 6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లేతో వస్తోంది. హువావే కిరిన్ 980ఎస్ఓసీని కలిగివుంది.

4000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగివుంది ఈ ఫోన్. 25మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరాతోపాటు రేర్ డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది.

ధర: రూ. 34,999(ఎమ్మార్పీ రూ.42,999)

రెడ్‌మీ వై2(Redmi Y2)

రూ. 10,499 విలువ గల జియోమీ రెడ్ మీ వై2 ఇప్పుడు రూ.7,999కే లభిస్తోంది. ఎక్ఛేంజ్ ఆఫర్ తో కొనుగోలు చేస్తే రూ.7,150కే లభిస్తుంది. కాగా, రెడ్ మీ వై3ని త్వరలోనే ఇండియాలో లాంచ్ చేయాలని జియోమీ కసరత్తులుచేస్తోంది. కాగా, ప్రస్తుతం ఈ ధరలో లభించే రెడ్ మీ వై2 మంచి స్మార్ట్ ఫోన్ అనే చెప్పొచ్చు.

ఇవే కాకుండా అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ పెస్ట్‌లో ఎంఐ ఏ2, ఒప్పో ఎఫ్11 ప్రో, శామ్సంగ్ గెలాక్సీ ఏ10, వీవో వై95, శామ్సంగ్ గెలాక్సీ ఎస్9 లాంటి ఫోన్లపై ఎక్ఛేంజ్ ఆఫర్లను అందిస్తోంది.