Asianet News TeluguAsianet News Telugu

ప్రమాదంలో నాగ శౌర్య కెరీర్... నెక్స్ట్ ఏంటి?


వరుస పరాజయాలతో నాగ శౌర్య డీలా పడ్డారు. చెప్పాలంటే ఆయన కెరీర్ ప్రమాదంలో పడింది. నాగ శౌర్య లేటెస్ట్ రిలీజ్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి కూడా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. 
 

young hero naga shaurya career in deep troubles
Author
First Published Mar 19, 2023, 3:04 PM IST

టైర్ టు హీరోల జర్నీ అంత సులభం కాదు. స్టార్ హీరోల మాదిరి కెరీర్ మీద భరోసా ఉండదు. రెండు మూడు ప్లాప్స్ పడితే మేకర్స్ ఆలోచనలో పడతారు. వారితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించరు. సక్సెస్ వీరికి చాలా అవసరం. కనీసం రెండేళ్లకోసారి హిట్ కొట్టాం అనిపించుకోవాలి. టాలీవుడ్ లో టైర్ టు హీరోలుగా కొనసాగుతున్న చాలా మంది హీరోల పరిస్థితి ఏం బాగోలేదు, నితిన్, రామ్, శర్వానంద్, విజయ్ దేవరకొండ, నాని కూడా స్ట్రగుల్ అవుతున్నారు. వీరిలో కొందరి కెరీర్స్ పూర్తిగా ప్రమాదంలో పడ్డాయి. 

వారిలో నాగ శౌర్య ఒకరు. ఈ యంగ్ హీరో ఎంత కష్టపడుతున్నా హిట్ తలుపు తట్టడం లేదు.  అదృష్టం కలిసి రావడం లేదు. ఊహలు గుసగుసలాడే మూవీతో వెలుగులో వచ్చిన నాగ శౌర్య... ఛలో మూవీతో క్లీన్ హిట్ అందుకున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన ఆ చిత్రం నాగ శౌర్యకు ఇమేజ్ తెచ్చిపెట్టింది. చలో మూవీ విడుదలై దాదాపు ఐదేళ్లు అవుతుంది. మళ్ళీ ఆ రేంజ్ హిట్ పడలేదు. అశ్వద్ధామ, లక్ష్యం చిత్రాల కోసం నాగ శౌర్య చాలా కష్టపడ్డారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ చిత్రాలు నిరాశపరిచాయి. 

వరుడు కావలెను, లక్ష్య, కృష్ణ వ్రింద విహారి చిత్రాలకు కనీస వసూళ్లు రాలేదు. ఇక లేటెస్ట్ రిలీజ్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి డిజాస్టర్ అంటున్నారు. నాగ శౌర్య కెరీర్లోనే అతి తక్కువ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ క్రమంలో నాగశౌర్య కెరీర్ ప్రమాదంలో పడిందంటున్న మాట వినిపిస్తోంది. కాగా నాగ శౌర్య నటిస్తున్న మరో రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నట్లు సమాచారం. ఆ రెండు చిత్రాలైనా నాగ శౌర్యకు విజయాలు అందించి పరిశ్రమలో హీరోగా నిలబెట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 

కాగా గత ఏడాది నాగ శౌర్య వివాహం జరిగింది. బెంగుళూరుకి చెందిన అనూష శెట్టిని ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆమె ప్రొఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్. ఓ సంస్థను నడుపుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios