క్యాన్సర్ ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. మనీషా కొయిరాలా, సోనాలి బింద్రే, యువరాజ్ సింగ్ లాంటి సెలెబ్రిటీలు క్యాన్సర్ ని ధైర్యంగా అధికమించారు. 

క్యాన్సర్ ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. మనీషా కొయిరాలా, సోనాలి బింద్రే, యువరాజ్ సింగ్ లాంటి సెలెబ్రిటీలు క్యాన్సర్ ని ధైర్యంగా అధికమించారు. కొందరు సెలెబ్రిటీలు మాత్రం క్యాన్సర్ తో పోరాడి తుదిశ్వాస విడిచారు. తాజాగా ఓ బుల్లితెర నటి జీవితాన్ని క్యాన్సర్ కబళించింది. 

ఎన్నో ఆశలతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన బుల్లితెర నటి రాజేశ్వరి రే (30) క్యాన్సర్ కారణంగా మరణించారు. పిన్న వయసులోనే ఆమె మరణించడంతో తీవ్ర విషాదం నెలకొంది. రాజేశ్వరి రే ఒడియా చిత్ర పరిశ్రమలో టివి నటిగా రాణిస్తున్నారు. 

2019లో ఆమెకి క్యాన్సర్ సోకింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో అభిమానులకు రాజేశ్వరి ఈ విషయాన్ని ఎమోషనల్ గా తెలియజేశారు. అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని చేసిన ప్రార్థనలు ఫలించలేదు. దీనితో ఒడియా చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. బుల్లితెర నటీనటులు, సినీ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. 

రాజేశ్వరి రేకి లంగ్ క్యాన్సర్ సోకినట్లు తెలుస్తోంది. ఆమెని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అనేక టివి సీరియస్ లో రాజేశ్వరి నెగిటివ్ రోల్స్ లో నటించారు.