`కేజీఎఫ్`తో సంచలనాలు సృష్టించాడు కన్నడ రాకింగ్ స్టార్ యష్. ప్రస్తుతం `టాక్సిక్`లో నటిస్తున్న ఆయన నెక్ట్స్ రావణుడిగా కనిపించబోతున్నారు. ఈ మూవీ పారితోషికం షాకిస్తుంది.
ఇటీవల కాలంలో మైథలాజికల్ ఎలిమెంట్లతో కూడిన సినిమాల జోరు సాగుతుంది. `హనుమాన్` సినిమా సంక్రాంతికి వచ్చి ఎంతటి పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిందే. అంతకు మందుకు ప్రభాస్ నటించిన `ఆదిపురుష్` పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ బాగానే వసూళ్లు చేసింది. ఇప్పుడు చిరంజీవి మైథలాజికల్ ఎలిమెంట్లతోనే `విశ్వంభర` సినిమా చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ నటిస్తున్న `కల్కి` కూడా అదే కాన్సెప్ట్ తో వస్తుంది. మంచు విష్ణు కూడా `కన్నప్ప`తో అదే ప్రయోగం చేస్తున్నాడు.
ఈ క్రమంలో మరో మైథలాజిక్ మూవీ రూపొందబోతుంది. రామాయణం ఆధారంగా `రామాయణ్` సినిమా తెరకెక్కబోతుంది. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు కాస్టింగ్ ఎంపిక కూడా జరుగుతుంది. ఇందులో రాముడిగా రణ్‌బీర్ పూర్‌ని ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతుంది. సీతగా సాయిపల్లవి పేరు, రావణుడిగా `కేజీఎఫ్` యష్ నేమ్ వినిపిస్తుంది. అలాగే హనుమంతుడిగా సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్ పాత్రలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ప్రభాస్ కూడా కనిపిస్తాడని తెలుస్తుంది. గెస్ట్ గా ఆయన మెరిసే అవకాశం ఉందట.
ఇదిలా ఉంటే ఈ మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నాడు నితీష్ తివారీ. స్టార్ కాస్టింగ్ పారితోషికాలే వందల కోట్లు అయ్యేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా యష్ పారితోషికం షాకిస్తుంది. సినిమాలో ఆయనకే అత్యధిక రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారట. ఏకంగా 150కోట్ల వరకు యష్‌కి పారితోషికం ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన పాత్ర మెయిన్‌గా సినిమా సాగుతుందని తెలుస్తుంది. పైగా `కేజీఎఫ్` తర్వాత యష్ రేంజ్ పెరిగిపోయింది. బాలీవుడ్‌లో మార్కెట్ ఏర్పడింది. పాన్ ఇండియా హీరో అయ్యాడు. దీంతో ఆయనకు భారీగా పారితోషికం ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
Read more: కోట్లిచ్చి సెలబ్రిటీలను పెళ్లిళ్లకు రమ్మంటున్నారు.. దుమారం రేపుతున్న నాగార్జున వ్యాఖ్యలు..
అయితే ప్రభాస్ ఇప్పుడు ఒక్కో సినిమాకి 120-150కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడట. సినిమా రేంజ్‌ని బట్టి ఆయన పారితోషికం ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న `కల్కి2898ఏడీ`కి 150కోట్లకుపైగానే ఇస్తున్నారట. దీంతో యష్ ఇప్పుడు ప్రభాస్‌తో పోటీ పడుతుండటం విశేషం. ఈ మూవీలో ఇతర ఆర్టిస్ట్‌ల పారితోషికాలు యాభై కోట్లలోపే ఉంటున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన నిజనిజాలు తెలియాల్సి ఉంది. `కేజీఎఫ్ 2` విడుదలైన దాదాపు ఏడాదిన్నర తర్వాత కొత్త సినిమాని ప్రకటించారు యష్. ప్రస్తుతం ఆయన `టాక్సిక్` అనే సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: మీనాక్షి చౌదరి సినిమాల లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. మరో శ్రీలీల అవుతుందా?