‘టైగర్‌’మీద డౌటా?,నిర్మాతే సీక్రెట్ రివీల్ చేసేసారు

పదేళ్ల కిందట సింహగర్జన చేస్తూ మీ హృదయాల్లో ఒక స్థానం సంపాదించుకున్నాడు. అదే ఊపుతో తను ఇప్పుడు మళ్లీ వస్తున్నాడు. ఈ దీపావళి కి థియేటర్లలో టైగర్‌ మీ ముందుంటాడు. 

Yash Raj Films revealed Hrithik Roshan will also be seen in Tiger3 jsp


పెద్ద సినిమాలకు ఓపినింగ్స్ అతి ప్రాధాన్యం...ముఖ్యంగా వీకెండ్ మూడు రోజులు కీలకం. అయితే అదే సమయంలో సినిమాలో ఉండే సర్పైజ్ లు, సీక్రెట్ లు ప్రేక్షకుడు తెలుసుకుంటేనే కిక్ అన్నట్లు వదిలేస్తారు. కానీ ఓపినింగ్స్ మీద డౌట్ ఉన్నప్పుడు వాటిని లీక్ చేయటమో లేక ముందే  రివీల్ చేయటమో చేస్తారు. ఇప్పుడు యష్ రాజ్ ఫిల్మ్స్ వారు అదే చేసారు. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌ చిత్రవర్గాలు, సల్మాన్‌ఖాన్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘టైగర్‌ 3’. ఇందులో తనకి జోడీగా కత్రినా కైఫ్‌ నటిస్తున్నారు. మనీశ్‌శర్మ దర్శకుడు  మొదటి రెండు భాగాలైన ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’బాగా వర్కవుట్ కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అదే సమయంలో సల్మాన్ ఖాన్ వరస ఫెయిల్యూర్స్ ఎదురుకుంటన్నారు. ఈ క్రమంలో ఓపినింగ్స్ ఎలా వస్తాయో తెలియని సిట్యువేషన్.  రీసెంట్ గా సల్మాన్‌ఖాన్‌ నటించిన ‘భాయీజాన్‌’డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమాకు మినిమం ఓపినింగ్స్ కూడా రాలేదు. ఈ నేఫద్యంలో ‘టైగర్‌ 3’కు సాలీడ్ ఓపినింగ్స్ రావాలంటే ..అందులో మరేదో అనిపించాలి. అందుకే హృతిక్ రోషన్ ఇందులో కామెయో పాత్రలో కనిపించబోతున్నాడని రివీల్ చేసేసారు. 

సాధారణంగా కామెడీ పాత్రలను సర్పైజ్ గా దాచి ఉంచాతారు. అయితే యష్ రాజ్ ఫిల్మ్స్ వారు...నిన్న తమ టైగర్ 3 లో షారూఖ్ ఖాన్ తో పాటు హృతిక్ రోషన్ కూడా కనపిస్తాడన్నారు. హృతిష్ రోషన్ కబీర్ పాత్ర వార్ నుంచి ఉండబోతోందని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే దీపావళి ఫెస్టివల్ కు హృతిక్,షారూఖ్, సల్మాన్ అభిమానులను ఈ సినిమాకు థియేటర్స్ రప్పించాలని ప్లాన్ చేసారని అర్దమవుతోంది. ముందే ఈ కామియోలు విషయం బయిటకు రావటంతో మౌత్ పబ్లిసిటీ జరిగి ఓపినింగ్స్ అదిరిపోతాయని బావిస్తోంది ట్రేడ్.
 
సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) - కత్రినా కైఫ్‌ (Katrina Kaif) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘టైగర్‌ 3’ (Tiger 3). మనీశ్‌ శర్మ దర్శకుడు. ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాలకు సీక్వెల్‌గా ఈసినిమా సిద్ధమవుతోంది. దేశభక్తి నేపథ్యంలో పవర్‌ఫుల్ యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. దీపావళి సెలబ్రేషన్స్‌లో భాగంగా నవంబర్‌ 12న ఇది విడుదల కానుంది. ‘పదేళ్ల కిందట సింహగర్జన చేస్తూ మీ హృదయాల్లో ఒక స్థానం సంపాదించుకున్నాడు. అదే ఊపుతో తను ఇప్పుడు మళ్లీ వస్తున్నాడు. ఈ దీపావళి కి థియేటర్లలో టైగర్‌ మీ ముందుంటాడు. ఈ చిత్రం హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది’ అంటూ పబ్లిసిటీ చేస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios