ప్రభాస్ తో సినిమా చేయటం ఇప్పుడు పెద్ద బ్యానర్స్ కు ప్రెస్టేజ్ ఇష్యూగా మారిందనటంలో సందేహం లేదు. తమ బ్యానర్ లో ఆయనతో ప్యాన్ ఇండియా సినిమా చేయాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్లే పావులు కదుపుతున్నారు. అయితే ప్రభాస్ ఎంత మందికి అని డేట్స్ ఇవ్వగలరు. అప్పటికి ఆయన మేనేజర్ మరో రెండేళ్ల దాకా ఎంత పెద్ద డైరక్టర్ అయినా, నిర్మాణ సంస్ద కు అయినా డేట్స్ ఇచ్చే పరిస్దితి లేదని తేల్చి చెప్పేస్తున్నారట. అయినా సరే...భారీ రెమ్యునేషన్ ఆఫర్ తో బాలీవుడ్ కు చెందిన ఓ నిర్మాణ సంస్ద ఉత్సాహపడుతోంది.

ఆ నిర్మాణ సంస్ద మరేదో కాదు యష్ రాజ్ ఫిల్మ్స్. ఈ సంస్దకు చెందిన ఆదిత్య చోప్రా..ఎట్టి పరిస్దితుల్లో ప్రభాస్ డేట్స్ తీసుకుని హృతిక్ రోషన్ తో కలిసి ఓ భారీ సినిమా ప్లాన్ చేయాలని డిసైడ్ అయ్యిందిట. అవసరం అనుకుంటే ప్రభాస్ డేట్స్ కుదించి ఇచ్చినా ఫరవాలేదని, ఎప్పుడు షూటింగ్ పెట్టుకుందామంటే అప్పుడే పెట్టుకుందామని, స్పీడుగా ఫినిష్ చేద్దామని,అలాగే రెమ్యునేషన్ విషయంలో ప్రభాస్ కనివిని ఎరగని మొత్తం ఇస్తానని ఆశపెడుతున్నారట. ఆఫర్ టెమ్టింగ్ గానే ఉన్నా ప్రభాస్ ముందడగు వేయలేని సిట్యువేషన్, అంత టైట్ గా బిజీ షెడ్యూల్ ఉందని అంటున్నారు. 
 
ఇక రీసెంట్ గా ప్రభాస్ బాలీవుడ్‌లో తన తొలి ప్రాజెక్టును ప్రకటించాడు. ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆది పురుష్’ మూవీ చేస్తున్నట్లు తెలిపి తన అభిమానులను సర్‌ప్రైజ్ చేసారు. రాముడి పాత్రలో ప్రభాస్ సూపర్‌గా సెట్ అవుతాడంటూ ఫ్యాన్స్  హ్యాపీగా ఉన్నారు.  2021లో షూటింగ్ చేసి 2022లో విడుదలకు సిద్ధం చేస్తామని నిర్మాతలు తెలిపారు. మరోవైపు ప్రభాస్ రాధేశ్యామ్, ఆ తర్వాత మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉందని తెలిసిందే. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే ఆది పురుష్ ప్రాజెక్టు మొదలుకానుంది.