Asianet News TeluguAsianet News Telugu

మహేష్ ఆ పని పొరపాటున కూడా చెయ్యడు...అది రూమరే

ఎఫ్‌ 2 తో హిట్టు కొట్టిన అనిల్ రావిపూడితో వర్క్ చేయడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.అందుకు కారణం ...మహేష్ బాబు ఈ సంక్రాంతి హిట్ బాగుందని ట్వీట్ చేయటం, అనీల్ రావిపూడి సైతం మహేష్ బాబు ని మెచ్చుకోవటం.

will Mahesh give chance to 'F2' director ?
Author
Hyderabad, First Published Jan 21, 2019, 7:47 AM IST

ఎఫ్‌ 2 తో హిట్టు కొట్టిన అనిల్ రావిపూడితో వర్క్ చేయడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.అందుకు కారణం ...మహేష్ బాబు ఈ సంక్రాంతి హిట్ బాగుందని ట్వీట్ చేయటం, అనీల్ రావిపూడి సైతం మహేష్ బాబు ని మెచ్చుకోవటం. అయితే ఇవన్నీ ఇండస్ట్రీలో కామన్ విషయాలు. ప్రక్క హీరో సినిమా బాగున్నప్పుడు ప్రశంసించటం, అలాగే హీరోల గురించి దర్శకులు పొగడ్తలు చేయటం రిలేషన్స్ మెయింటైన్ చేయటం కోసమే.

అంత మాత్రాన హిట్ కొట్టిన ప్రతీ దర్శకుడుతో మహేష్ వంటి స్టార్ సినిమాలు ఎక్కడ చేగలరు. అయితే  మహేష్ కు హిట్ కొట్టిన దర్శకులంటే మహా ఇష్టం. మొహమాటం లేకుండా మనం సినిమా చేసెయ్యాలి అనేస్తాడు. ఇంతకు ముందు సైతం  అర్జున్ రెడ్డి దర్శకుడిని పిలిచి మరి చర్చలు జరిపి ప్రాజెక్టు పైనల్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఏమో.. ఎఫ్ 2 డైరక్టర్ కు సినిమా ఇచ్చేస్తాడేమో అని మీడియాలో వార్తలు వచ్చేసాయి.

అయితే అర్జున్ రెడ్డి సంగతి వేరు. అది ఓ ట్రెండ్ సెట్టర్. ఎఫ్ ఎంత పెద్ద హిట్ అయినా అది రెగ్యులర్ కామెడీ సినిమానే. కాబట్టి మహేష్ ఎట్టి పరిస్దితుల్లోనూ అనీల్ రావి పూడితో ఇప్పుడు మాత్రం సినిమా చేసే అవకాసం లేదు. ఏమో భవిష్యత్ లో మరిన్ని బ్లాక్ బస్టర్స్ వస్తే మహేష్ ముచ్చటటపడతాడేమో. ఎందుకంటే మహేష్ పూర్తి కామెడీ చేసే సిట్యువేషన్ లో లేడు.

అయితే మహేష్ గత కొద్ది కాలంగా సినిమాల ఎంపిక విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. శ్రీకాంత్ అడ్డాలను నమ్మి మహేష్ ...బ్రహ్మోత్సవంతో  దెబ్బ తినటం.... మురగదాస్ తో  స్పైడర్ తో షాక్ తినటంం...పెద్ద పాఠాలే నేర్పాయి. ఈ నేపధ్యంలో ప్రస్తుతానికి సుకుమార్ తోనూ..ఆ తర్వాత సందీప్ వంగాతోనూ సినిమా లు చేసే పనిలో ఉన్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios