సల్మాన్‌ చాలా మంది హీరోయిన్లతో డేటింగ్‌ చేశారు. వారిలో ప్రధానంగా కత్రినా కైఫ్‌తో మాత్రం బాగా తిరిగారు. వీరిద్దరు ఘాటు ప్రేమలోనూ మునిగి తేలారు. వీరిద్దరు మ్యారేజ్‌ చేసుకుంటారనే వార్తలు కూడా అప్పట్లో చక్కర్లు కొట్టాయి. కానీ

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) హిందీలో టాప్‌ స్టార్‌. అదే సమయంలో ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న స్టార్‌. అమీర్‌ ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌, హృతిక్‌ల కంటే తను జయాపజయాలకు అతీతంగా బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. మరోవైపు ఛాన్స్ దొరికినప్పుడు స్పెషల్‌ వీడియో సాంగ్‌లు కూడా చేస్తూ ఆకట్టుకుంటున్నారు. 56ఏళ్ల మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ పెళ్లి చేసుకునేందుకు మాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదు. 

Salman Khan చాలా మంది హీరోయిన్లతో డేటింగ్‌ చేశారు. వారిలో ప్రధానంగా కత్రినా కైఫ్‌తో మాత్రం బాగా తిరిగారు. వీరిద్దరు ఘాటు ప్రేమలోనూ మునిగి తేలారు. వీరిద్దరు మ్యారేజ్‌(Salman Khan Marriage) చేసుకుంటారనే వార్తలు కూడా అప్పట్లో చక్కర్లు కొట్టాయి. కానీ ఊహించని విధంగా వీరిద్దరు విడిపోయారు. కానీ కత్రినాతో మాత్రం సినిమాలు చేస్తూ హిట్‌ పెయిర్‌గా నిలుస్తున్నారు. ఆరు పదులు దగ్గరపడుతున్నా సల్మాన్‌ ఖాన్‌ ఇంకా పెళ్లి చేసుకోలేదనేది ఓ మిస్టరీగా మారింది. 

కానీ ఇప్పుడు ఆయన రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్త అటు బాలీవుడ్‌లో, ఇటు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా సల్మాన్‌ ఖాన్‌.. బాలీవుడ్‌ సీనియర్‌ హీరో శత్రుఘ్న సిన్హా కూతురు, హీరోయిన్‌ సోనాక్షి సిన్హా(Sonakshi)ని పెళ్లి చేసుకుందనే వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. సల్మాన్‌,సోనాక్షి రింగులు మార్చుకున్నట్టుగా ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. మరి ఎందుకు వీరిద్దరు సీక్రెట్‌గా మ్యారేజ్‌ చేసుకున్నారు. 

వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు. అలాంటిది అనూహ్యంగా మ్యారేజ్‌ చేసుకోవడం వెనకాలు కారణమేంటనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు నిజం బయటకొచ్చింది. సల్మాన్‌ ఖాన్‌, సోనాక్షి సిన్హా మ్యారేజ్‌ వెనకాల కారణం తేలిపోయింది. వీరిద్దరు అసలు మ్యారేజ్‌ చేసుకోలేదనేది స్పష్టమవుతుంది. అయితే మరి ఆ ఫోటో గురించి ఆరా తీస్తే అది ఫ్యాన్‌ మేడ్‌ పిక్చర్‌ అని తెలుస్తుంది. ఏదో మార్ఫింగ్‌ చేసి ఉంటారని చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే సల్మాన్‌ ఖాన్‌, సోనాక్షి సిన్హా కలిసి `దబాంగ్‌` చిత్రాల్లో నటించారు. ఈ సినిమా సిరీస్‌ అన్నింటిలోనూ సోనాక్షి కథానాయిక. ఆసినిమాలోని స్టిల్స్ ని అభిమానులు ఇలా మార్ఫింగ్‌ చేసి ఉంటారనే అంటున్నారు. ప్రస్తుతం సల్మాన్‌ `టైగర్‌ 3`, `బాయిజాన్‌`, 'కబీ ఈద్‌ కబీ దివాళి' సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చిరంజీవి `గాడ్‌ఫాదర్‌`లో గెస్ట్ రోల్‌ చేస్తున్నారు. షారూఖ్‌ `పఠాన్‌`లోనూ గెస్ట్ గా మెరవబోతున్నారు. సోనాక్షి ప్రస్తుతం `కకుడా`, `డబల్‌ ఎక్స్ ఎల్‌` చిత్రాల్లో నటిస్తుంది.