Asianet News TeluguAsianet News Telugu

‘క్రాక్‌’ కథ విని రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే...

 రిలీజ్ కు ముందు ట్రైలర్ వర్కవుట్ అవటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే క్రాక్ చిత్రాన్ని రూపొందించినట్లుగా హిట్ టాక్ ని బట్టి అర్దమైంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ...మొదట దీన్ని వెంకటేష్ కోసం రెడీ చేసారట. గోపీచంద్ మలినేని, వెంకీ కాంబినేషన్ లో బాడీ గార్డ్ చిత్రం వచ్చింది. అయితే ఆ సినిమా వర్కవుట్ కాలేదు. దాంతో ఈ సినిమా కథ విషయంలో వెంకీ చాలా డౌట్స్ వ్యక్తం చేసారట. దానికి తోడు సురేష్ బాబు సైతం ఎప్పటిలాగే మార్పులు చాలా చెప్పారట.

Who rejected Krack before Ravi Teja signed it? JSP
Author
Hyderabad, First Published Jan 13, 2021, 2:54 PM IST

మాస్ మహారాజా రవితేజ, గ్లామర్ స్టార్ శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బి. మధు నిర్మించిన చిత్రం 'క్రాక్'. డాన్ శ్రీను, బలుపు చిత్రాల తర్వాత రవితేజ-గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో సంక్రాంతి కానుకగా వచ్చిన  ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ కు ముందు ట్రైలర్ వర్కవుట్ అవటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే క్రాక్ చిత్రాన్ని రూపొందించినట్లుగా హిట్ టాక్ ని బట్టి అర్దమైంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ...మొదట దీన్ని వెంకటేష్ కోసం రెడీ చేసారట. గోపీచంద్ మలినేని, వెంకీ కాంబినేషన్ లో బాడీ గార్డ్ చిత్రం వచ్చింది. అయితే ఆ సినిమా వర్కవుట్ కాలేదు. దాంతో ఈ సినిమా కథ విషయంలో వెంకీ చాలా డౌట్స్ వ్యక్తం చేసారట. దానికి తోడు సురేష్ బాబు సైతం ఎప్పటిలాగే మార్పులు చాలా చెప్పారట. 

అయితే ఆ మార్పులన్నీ చేయలేక..తను తయారు చేసుకున్న స్క్రిప్టుని పూర్తిగా నమ్మిన గోపీచంద్ మలినేని..మరో ఆప్షన్ కోసం వెతికారు. అదే సమయంలో వరస ఫ్లాఫ్ లతో రవితేజ హిట్ కోసం డెస్పరేట్ గా ఉన్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో రెండు హిట్ సినిమాలు వచ్చాయి. దాంతో వెంటనే గోపీచంద్ మలినేని..రవితేజను కలసి కథ చెప్పారు. ఆయన మరో మాట చెప్పకుండా గోపిచంద్ మీద ఉన్న నమ్మకంతో ఓకే చేసేసారు. ఆ తర్వాత రవితేజ ..నిర్మాత ఠాగూర్ మధు దగ్గరకు తీసుకెళ్లి అడ్వాన్స్ ఇప్పించటం, ప్రాజెక్టు సైన్ చేయటం, వరసగా జరిగిపోయాయి. ఈ నేపధ్యంలో వెంకటేష్ కనుక ఈ కథు చేసి ఉంటే ఎలా ఉండేదనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

అయితే  ‘క్రాక్’ మూవీకి విక్టరీ వెంక‌టేష్ వాయిస్ ఓవ‌ర్ ఇచ్చారు. ఆయ‌న వాయిస్ ఓవ‌ర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.   తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా రూపొందొంది. ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకొనే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. స‌ర‌స్వతి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మించిన ఈ చిత్రంలో స‌ముద్రఖని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఎస్. త‌మ‌న్ సంగీతం సమకూర్చిన  ఈ సినిమాకు జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ అందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios