Asianet News TeluguAsianet News Telugu

ఆ హీరోతో కలిసి ఫుల్లుగా తాగేసిన తాప్సీ హోటల్ లోనే..!

టాలీవుడ్ లో హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ అవకాశాలు దక్కించుకుంటూ నటిగా మంచి పేరు తెచ్చుకుంటోంది. 

When Taapsee Pannu got too drunk with Vicky Kaushal and wanted to sleep in the garden hotel
Author
Hyderabad, First Published May 7, 2019, 3:02 PM IST

టాలీవుడ్ లో హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ అవకాశాలు దక్కించుకుంటూ నటిగా మంచి పేరు తెచ్చుకుంటోంది. చక్కటి కాన్సెప్ట్ తో ఉన్న సినిమాల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

గతేడాదిలో ఆమె విక్కీ కౌశల్ తో కలిసి నటించిన 'మన్మర్జియాన్' సినిమా మంచి సక్సెస్ అయింది. తాజాగా ఈ జంట కలిసి ఓ టీవీ షోలో పాల్గొంది. 'మన్మర్జియాన్' సినిమా షూటింగ్  సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత చిత్రబృందం ఓ పార్టీ చేసుకున్నారట.

ఆ పార్టీలో ఫుల్లుగా మద్యం సేవించినట్లు తాప్సీ స్వయంగా చెప్పుకొచ్చింది. విక్కీ కూడా తనతో కలిసి బాగా తాగినట్లు చెప్పింది. ఆ తరువాత అక్కడే పడుకోవాలనుకున్నట్లు ఆ హోటల్ తనకు అంత బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది.

ఇంతలో కల్పించుకున్న విక్కీ ''మేము స్టే చేసిన హోటల్ లో ప్రతి రోజు డిన్నర్ అయిన తరువాత గార్డెన్ లో నడుచుకుంటూ వెళ్తూ రిలాక్స్ అయ్యేవాళ్లం.. ఆ రోజు పార్టీ ముగిసిన తరువాత తాప్సీ అక్కడే ఉందామని పట్టుబట్టింది. ఆమెకు ఆ ప్లేస్ అంతగా నచ్చింది. నేను ఎంత కన్విన్స్ చేసినా వినలేదు'' అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. 

ప్రస్తుతం తాప్సీ తడ్కా, గేమ్ ఓవర్, మిషన్ మంగల్, సాంద్ కి ఆంఖ్ వంటి చిత్రాల్లో నటిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios