Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ రోల్ లో మహేష్ ని చూడాలనుకున్న కృష్ణ... మహేష్ నిరాకరించడంతో!

సూపర్ స్టార్ కృష్ణకు పాతాళ భైరవి మూవీ అంటే మహా ఇష్టం అట. ఈ చిత్రాన్ని మహేష్ బాబుతో హిందీ రీమేక్ చేయాలని అనుకున్నారట. ఈ ప్రతిపాదన కృష్ణ కొడుకు మహేష్ బాబు ముందుకు కూడా తీసుకెళ్లారట. 

when super krishna wants to remake pathala bhairavi with mahesh but ksr
Author
Hyderabad, First Published May 30, 2021, 6:55 PM IST


విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ నటించిన చిత్రాలలో పాతాళ భైరవి కి ప్రత్యేక స్థానం ఉంది. దర్శకుడు కేవి రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీ టాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా మిగిలిపోయింది. ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు తమ అద్భుత నటనతో సినిమాను కీర్తి శిఖరాలకు ఎక్కించారు. సూపర్ స్టార్ కృష్ణకు పాతాళ భైరవి మూవీ అంటే మహా ఇష్టం అట. ఈ చిత్రాన్ని మహేష్ బాబుతో హిందీ రీమేక్ చేయాలని అనుకున్నారట. 


ఈ ప్రతిపాదన కృష్ణ కొడుకు మహేష్ బాబు ముందుకు కూడా తీసుకెళ్లారట. అయితే మహేష్ బాబు మాత్రం ఆసక్తి చూపలేదట. దానికి కారణం మహేష్ కి బాలీవుడ్ ఎంట్రీ పై ఆసక్తి లేకపోవడమే నట. ఇక్కడ టాప్ స్టార్ గా ఉన్న ఆయన బాలీవుడ్ లో వారిలో ఒకడిగా, ఆ సినిమా చేసి విడుదల చేయడానికి ఇష్టపడలేదట. మహేష్ తో పాతాళ భైరవి మూవీ హిందీ రీమేక్ చేయాలని అనుకున్నట్లు కృష్ణ స్వయంగా ఓ సంధర్భంలో తెలియజేశారు. 


కాగా కృష్ణ అల్లుడైన సుధీర్ బాబు హీరోగా నటించిన ప్రేమ కథా చిత్రాన్ని హిందీలో హీరో హృతిక్ రోషన్ తో చేయాలని కృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ లో కృష్ణ నిర్మాతగా ఆ మూవీ తెరకెక్కించాలని ఆయన చెప్పారు. కాగా రేపు ఆయన పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అయితే కృష్ణ బర్త్ డే కానుకగా సర్కారు వారి పాట చిత్రం నుండి అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ భావించారు. దేశంలో నెలకొన్న దుర్భర పరిస్థితుల రీత్యా మహేష్ చిత్రం నుండి ఎటువంటి అప్డేట్ ఉండదని సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios