Asianet News TeluguAsianet News Telugu

తనకు పెళ్లైన విషయం మర్చిపోయిన స్టార్ హీరోయిన్!

దీపికా 'లివ్ లవ్ లాఫ్' అనే ఫౌండేషన్ ను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలో ఈ సంస్థకి సంబంధించిన ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.

When Deepika Padukone Hilariously 'Forgot' She's A Wife
Author
Hyderabad, First Published Sep 18, 2019, 12:20 PM IST

స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్.. నటుడు రణవీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో వీరిది అందమైన ప్రేమ జంటనే చెప్పాలి. అయితే ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో దీపికా తనకు పెళ్లైన విషయాన్ని మర్చిపోయింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీపికా 'లివ్ లవ్ లాఫ్' అనే ఫౌండేషన్ ను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలో ఈ సంస్థకి సంబంధించిన ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా దీపికా తన నిత్యజీవితంలో పోషించే పాత్రల గురించి మాట్లాడుతూ.. 'ఒక కూతురిగా, ఒక సోదరిగా, ఒక నటిగా..' అని ఆగిపోయారు. వెంటనే పక్కన ఉన్న హోస్ట్ ఒక భార్యగా అని చెప్పగానే.. 'అవును.. ఒక భార్యగా కూడా.. ఓ మైగాడ్ నేను మర్చిపోయాను' అని నవ్వుతూ దీపికా అన్నారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం దీపికా, రణవీర్ కలిసి '83' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇండియన్ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios