Asianet News TeluguAsianet News Telugu

శ్రీనువైట్లకి ఏమైంది..?

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా కొనసాగాడు. సెన్సిబుల్ కామిక్ టైమింగ్ తో కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంలో శ్రీనువైట్ల దిట్ట. వెంకీ, రెడీమ్ దూకుడు, బాద్ షా ఇలా ఎన్నో మాసివ్ హిట్ తన కెరీర్ లో ఉన్నాయి. కానీ ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ వంటి సినిమాలతో రేసులో వెనుకబడ్డాడు. 

whats wrong srinu vaitla
Author
Hyderabad, First Published Nov 16, 2018, 4:33 PM IST

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా కొనసాగాడు. సెన్సిబుల్ కామిక్ టైమింగ్ తో కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడంలో శ్రీనువైట్ల దిట్ట. వెంకీ, రెడీమ్ దూకుడు, బాద్ షా ఇలా ఎన్నో మాసివ్ హిట్ తన కెరీర్ లో ఉన్నాయి. కానీ ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్ వంటి సినిమాలతో రేసులో వెనుకబడ్డాడు.

తాజాగా అతడు తెరకెక్కించిన 'అమర్ అక్బర్ అంటోనీ' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో శ్రీనువైట్ల మళ్లీ గాడిలో పడతాడని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ సినిమా శ్రీనువైట్ల కెరీర్ లోనే డిజాస్టర్ గా చోటు దక్కించుకుంది. సినిమాను కొన్న బయ్యర్లు టాక్ విని లబోదిబో మంటున్నారు.

సినిమాకోసం ఎన్నుకున్న ప్లాట్ దగ్గర నుండి అతడిపై విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. స్క్రీన్ ప్లే, పాటలు, దర్శకత్వం ఇలా సినిమాలో ఏ ఒక్క ఎలిమెంట్ కూడా ఆకట్టుకునే విధంగా లేదని తెలుస్తోంది. ఈ సినిమాతో మరోసారి వైట్ల తను అవుట్ డేటెడ్ అని నిరూపించుకున్నాడని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

సినిమాలో కామెడీ ట్రాక్ లు ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారాయని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ వారికి ఈ సినిమాతో నష్టాలు తప్పవని అంటున్నారు. ఈ సినిమా రిజల్ట్ తో శ్రీనువైట్లకి మరో ఛాన్స్ దక్కుతుందా అనే విషయంపై సందేహాలు నెలకొన్నాయి!  

Follow Us:
Download App:
  • android
  • ios