Asianet News TeluguAsianet News Telugu

‘సాహో’:ప్రభాస్ నమ్మింది యాక్షన్ ఎపిసోడ్స్ కాదు, మరి?

'బాహుబలి' తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రన్ రాజా రన్‌ ఫేం సుజిత్ దర్శకుడు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్, ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా నీల్ నితిన్ ముఖేష్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.  ఈ సినిమాలో హైలెట్స్ గా ఇప్పటిదాకా యాక్షన్ ఎపిసోడ్స్ అని చెప్పుకుంటూ వస్తున్నారు. 
 

What is X Factor in Prabhas's Saaho?
Author
Hyderabad, First Published Jun 7, 2019, 9:09 AM IST

'బాహుబలి' తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రన్ రాజా రన్‌ ఫేం సుజిత్ దర్శకుడు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్, ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా నీల్ నితిన్ ముఖేష్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.  ఈ సినిమాలో హైలెట్స్ గా ఇప్పటిదాకా యాక్షన్ ఎపిసోడ్స్ అని చెప్పుకుంటూ వస్తున్నారు. 

వదిలిన టీజర్స్ తో కూడా అదే విషయం ఎస్టాబ్లిష్ అయ్యింది. మరీ ముఖ్యంగా హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ యాక్షన్ కొరియోగ్రఫీ  సినిమాకు హైలెట్ అంటున్నారు.  అయితే ప్రభాస్ నమ్మకం పెట్టుకుంది మాత్రం  ఈ యాక్షన్ ఎపిసోడ్స్ పై మాత్రం కాదట. ఇంతకన్నా ఎక్కువ ప్రపంచం చూసేసిందని, కాబట్టి కేవలం చూస్తున్నప్పుడు ఎంగేజ్ చేయటానికి యాక్షన్ ఎపిసోడ్స్  అని ఆయన అభిప్రాయంట.

మరి ప్రభాస్ ఈ సినిమాలో ఏవి వర్కవుట్ అవుతాయని నమ్ముతున్నారు. ఏమిటా ఎక్స ఫాక్టర్ అంటే..ట్విస్ట్ లు అని తెలుస్తోంది. సుజిత్ ఈ కథలో చెప్పిన ట్విస్ట్ లు, వాటని సపోర్ట్ చేస్తూ వచ్చే ఎమోషన్ సీన్స్  హైలెట్ గా ఉంటాయని భావిస్తున్నాడట. చూస్తున్న ప్రేక్షకులు వాటిని థ్రిల్లింగ్ గా ఫీలై,  వర్కవుట్ అయితే సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆయన నమ్ముతున్నారట. ప్రభాస్ అంతలా నమ్మకం పెట్టుకున్నాడంటే ఖచ్చితంగా అదిరిపోయే ట్విస్ట్ లు ఉన్నాయన్నమాట. 

Follow Us:
Download App:
  • android
  • ios