Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి శుభలేఖపై దేవుడుగా బాలయ్య, ఓ వీరాభిమాని రచ్చ

అందరి హీరోల అభిమానులు వేరు..బాలయ్య అభిమానులు వేరు. 

Wedding Card Of Nandamuri Balakrishna Fan Goes Viral
Author
Hyderabad, First Published May 6, 2019, 12:43 PM IST

అందరి హీరోల అభిమానులు వేరు..బాలయ్య అభిమానులు వేరు. వారు అభిమానానికి కేరాఫ్ ఎడ్రస్ గా ఉంటారు. బాలయ్య సినిమా విడుదలైతే ధియోటర్స్ దగ్గర రచ్చ, హోర్డింగ్స్ కు  పాలాభిషేకాలు, రక్తదానాలు, కేక్ కటింగ్‌లు వంటి వాటితో పండగ వాతావరణం క్రియేట్ చేస్తారు. అయితే ఇప్పుడు ఆ అభిమాని వీరాభిమానం  మరింత ముందుకు వెళ్లింది. 

సాధారణంగా వివాహ శుభలేఖలో  దేవుళ్ల ఫోటోలు ప్రచురిస్తారు. కానీ కర్ణాటకకు చెందిన  ఓ వీరాభిమని మాత్రం పెళ్లి కార్డుపై నందమూరి బాలకృష్ణ ఫోటో ప్రింట్ చేసి హల్ చల్ చేస్తున్నాడు.  ఈ వివాహ ఆహ్వాన పత్రికలో వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న బాలయ్య ఫోటో ముద్రించాడు. కవర్ పై బాలయ్య ఫోటో... లోన పత్రికపై వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న బాలయ్య పిక్, వెనక స్టైలిష్‌గా మరో పిక్‌తో పత్రిక అచ్చు వేయించారు. 

కర్ణాటకకు చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి తన కొడుకు పెళ్లిని మే 13న చేయబోతున్నాడు. ఆ వివాహానికి సంబంధించిన కార్డులో బాలయ్య ఫోటోలను పెట్టి ముద్రించిన శ్రీనివాసులు.. నందమూరి అభిమానులంతా తన కొడుకు పెళ్లికి హాజరు కావాలని కోరుతూ ఆహ్వానం పలికాడు.  

ఆ శుభలేఖలో మే 13న తన కుమారుడి పెళ్లికి బాలయ్య, నందమూరి అభిమానులు హాజరై.. తన కుమారుడికి ఆశీస్సులు అందించాలని కోరాడు. ఈ దంపతులకు బాలయ్య బాబు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు శ్రీనివాసులు ఆ శుభలేఖలో రాసుకొచ్చారు. కాగా ఈ పెళ్లి పత్రికకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వెడ్డింగ్ కార్డు చూసిన నందమూరి అభిమానులు చాలా ఆనందపడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios