సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో "స్పిరిట్" అనే సినిమాను స్టార్ట్ చేయనున్నాడు ప్రభాస్. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు ప్రభాస్. సందీప్ రెడ్డి వంగా ఇప్పటికే "స్పిరిట్" కోసం కథను డెవలప్ పూర్తి చేసారు.
ఇప్పుడు ఎక్కడ విన్నా ప్రభాస్ పేరే వినపడుతోంది. వరస ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉన్నారు. ఆయన లైనప్ లోనే అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగతో ఎప్పుడో ఓ సినిమా ను ప్రకటించాడు. స్పిరిట్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేయగా ఈ సినిమా నుండి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే అందలేదు. అయితే ఈ సినిమా రైట్స్ మాత్రం తామే తీసుకుంటామంటూ తెలుగులో పేరున్న ఓ నిర్మాణ సంస్ద ప్రకటించింది. ఆ సంస్ద మరేదో కాదు పీపుల్స్ మీడియా.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్ట్రాల 'ఆదిపురుష్' థియేట్రికల్ హక్కులను రూ. 160 కోట్లకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసుకుందని తెలిసింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ మీడియాతో మాట్లాడిన ఆ సంస్ద అధిపతి విశ్వప్రసాద్..స్పిరిట్ చిత్రం గురించి కూడా చెప్పారు.
విశ్వప్రసాద్ మాట్లాడుతూ..తమకు T-Series వారితో ఉన్న అండర్ స్టాండింగ్ తో #Adipurush తెలుగు రైట్స్ ని 160 కోట్లు ప్లస్ జీ ఎస్టీ కలిపి మొత్తం 185 కోట్లు చెల్లించి తీసుకున్నామని చెప్పారు. అలాగే ప్రభాస్ హీరోగా రూపొందుతున్న #Spirit చిత్రం రైట్స్ సైతం తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమాను ఆ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రభాస్ వరస ప్రాజెక్టుల లిస్ట్ లో ఇంకా సెట్స్ పైకి రాని సినిమా ఏదైనా ఉందంటే, అది ఇదే. ఇప్పుడీ సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నాడు ప్రభాస్. డిసెంబర్ నుంచి స్పిరిట్ సినిమా సెట్స్ పైకి వస్తుంది. అక్టోబర్ నాటికి మారుతితో చేస్తున్న సినిమాను ఓ కొలిక్కి తీసుకురాబోతున్నాడు ప్రభాస్. అప్పటికే ప్రాజెక్ట్-కె షూట్ కూడా దాదాపు పూర్తయిపోతుంది. ఆ వెంటనే స్పిరిట్ మూవీ సెట్స్ పైకి వస్తుంది. ఈ గ్యాప్ లో సందీప్ రెడ్డి కూడా రణబీర్ తో చేస్తున్న యానిమల్ సినిమా నుంచి బయటకొచ్చేస్తాడు.
ఈ ఏడాది ప్రభాస్ నుంచి ఆదిపురుష్, సలార్ సినిమాలు వస్తున్నాయి. వచ్చే ఏడాదికి ప్రాజెక్ట్-కె, మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమాలు రెడీ చేస్తున్నాడు. ఇక 2025కి స్పిరిట్ రెడీ అవుతుంది. ఆ ఏడాదికి చేయాల్సిన మరో సినిమాను కూడా ప్రభాస్ త్వరలోనే ప్రకటించబోతున్నాడు.
