యోగా టీచర్‌ కాస్త ఊహించిన విధంగా హీరోయిన్‌గా మారి ఇప్పుడు అగ్ర హీరోయిన్‌ స్థాయికి ఎదగడంతోపాటు తిరుగులేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని, ఇమేజ్‌ని సొంతం చేసుకుంది అనుష్క శెట్టి. ఈ బెంగుళూరు బ్యూటీ మొదట గ్లామర్‌ పాత్రల్లో మెప్పించి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు సంబంధించి నయా ట్రెండ్‌ని క్రియేట్‌ చేసి ఇప్పుడు శక్తివంతమైన మహిళా ప్రధాన చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. 

తెలుగు, తమిళంలో ప్రముఖంగా రాణిస్తున్న అనుష్క శెట్టి పుట్టిన రోజు నేడు(శనివారం). ఈ సందర్బంగా బర్త్ డే సీడీపీని విడుదల చేశారు అభిమానులు. ఈ బర్త్ డే సీడీపీని ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అనుష్కకి బర్త్ డే విశెష్‌ తెలిపారు. `అత్యద్భుతమైన, చిరస్మరణీయమైన ప్రదర్శనతో మన హృదయాలను కొనసాగిస్తున్న మా వారియర్‌ క్వీన్‌ `రుద్రమదేవి`కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 

ఇందులో అనుష్క జనరల్‌ ఫోటో మెయిన్‌గా ఉండగా, కింద `అరుంధతి`లోని ఆమె గెటప్‌, అలాగే దేవసేనగా `బాహుబలి`లోని గెటప్సులు, `వేదం` సినిమాలోని గెటప్‌, `భాగమతి` గెటప్‌, `రుద్రమదేవి` గెటప్పులున్నాయి. బర్త్ డే సీడీపీ విశేషంగా ఆకట్టుకుంటుంది. దీన్ని, హ్యాపీబర్త్డ డే అనుష్క శెట్టి యాష్‌ ట్యాగ్‌ని అభిమానులు ట్రెండ్‌ చేస్తున్నారు.