Asianet News TeluguAsianet News Telugu

ఫ్యాన్స్ కి మెగాస్టార్‌ మాస్‌ ట్రీట్‌.. `వాల్తేర్ వీరయ్య` ఫస్ట్‌ సాంగ్‌.. థియేటర్లు ఊగిపోవాల్సిందే

చిరంజీవి హీరోగా నటిస్తున్న `వాల్తేర్‌ వీరయ్య` చిత్రంలోని మొదటి పాట విడుదలైంది. `బాస్‌ పార్టీ` పేరుతో సాగే ఈ మాస్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేయగా, అది దుమ్మురేపుతుంది.

waltair veerayya first song boss party release it mass treat for chiranjeevi fans
Author
First Published Nov 23, 2022, 4:32 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి త్వరలో `వాల్తేర్‌ వీరయ్య`తో రాబోతున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయనలోని మాస్‌ యాంగిల్‌ని బయట పెట్టబోతున్న చిత్రమిది. ఊరమాస్‌ లుక్‌లో ఇప్పటికే చిరంజీవి అదరగొడుతున్నారు. ఫ్యాన్స్ సంబరాలు షురూ చేశారు. దాన్ని మరింత పెంచబోతున్నారు చిరు. `వాల్తేర్‌ వీరయ్య`లోని ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేశారు. `బాస్‌ పార్టీ` అంటూ సాగే పార్టీ సాంగ్ ని విడుదల చేశారు. 

ఓ పబ్‌లో వచ్చేఈ పాట విడుదల కాగా దుమ్మురేపుతుంది. ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా అందాలు, స్టెప్పుడు మరింత స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవనున్నాయి. `ఖైదీ నంబర్‌ 150`లో తనదైన స్టెప్పులతో అదరగొట్టాడు చిరు. ఆ తర్వాత రెండు సినిమాల్లోనూ అది మిస్‌ అయ్యింది. కానీ `వాల్తేర్‌ వీరయ్య`లో మాత్రం అవి పుష్కలంగా ఉండబోతున్నాయని అర్థమవుతుంది. తాజాగా విడుదలైన పాటలో చిరంజీవి తన మార్క్ స్టెప్పులతో అదరగొడుతున్నారు. దీంతో అభిమానులుపండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. 

ఇందులో లుంగీకట్టి, షర్ట్ బటన్స్ విప్పి, లోపల బనియన్‌తో ఊరమాస్‌ లుక్‌లో ఉన్నారు మెగాస్టార్‌. ఆయన అభిమానులు కోరుకునే విధంగా, వారిని ఖుషీ చేసేలా ఆయన లుక్‌ ఉండటం విశేషం. ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించడంతోపాటు ఆయనే ఈ పాటని ఆలపించారు. ఆయనతోపాటు నకాష్‌ ఆశిష్‌, హరిప్రియా పాడారు. దేవిశ్రీప్రసాద్‌ నే ఈ పాటని రాయడం విశేషం. 

చిరంజీవి హీరోగా నటించిన ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. మాస్‌ మహారాజా రవితేజ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఆయనకు జోడీగా కేథరిన్‌ థ్రెసా చేయనుంది. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్‌, నవీన్‌ ఎర్నేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ ఏడాదిలో `ఆచార్య`, `గాడ్‌ ఫాదర్‌`తో వచ్చాడు చిరంజీవి. మరో నెల రోజుల్లో మరోసారి థియేటర్లలో సందడి చేయబోతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios