రూ. 1.13 కోట్ల రూపాయల కలెక్షన్స్ అతి తక్కువ సమయంలో రాబట్టిన మూవీగా వాల్తేరు వీరయ్య ఆల్‌టైమ్ రికార్డు సెట్ చేసింది.
పోయిన ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ మూవీస్‌తో పలకరించారు మెగాస్టార్. ఇక చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా జనవరి 13న సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. విడుదలైన ప్రమోషన్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు మౌత్ టాక్ వల్ల వాల్తేరు వీరయ్య మిగితా సినిమాలతో పోల్చితే మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే 200 కోట్లకు పైగా వసూలు చేసి చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేసిందీ చిత్రం.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా వైజాగ్ జగదాంబ థియేటర్ లో ... ఓ రేర్ ఫీట్ చేసింది. ఇక్కడ రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఆల్ టైమ్ రికార్డ్ ఉంది. ఇప్పుడు వాల్తేరు వీరయ్య చిత్రం ఆ రికార్డ్ ని బ్రద్దలు కొట్టిందని సమాచారం. రూ. 1.13 కోట్ల రూపాయల కలెక్షన్స్ అతి తక్కువ సమయంలో రాబట్టిన మూవీగా వాల్తేరు వీరయ్య ఆల్‌టైమ్ రికార్డు సెట్ చేసింది.
ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.230 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. చాలా రోజులుగా సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న చిరంజీవి, ఆయన అభిమానులకు సినిమా బ్లాక్ బస్టర్ కావటం పెద్ద ఊరటనిచ్చిన అంశమనే చెప్పాలి. తాజాగా మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుంచి గ్యాంగ్ లీడర్ అంటూ సాగే బ్యాగ్రౌండ్ పాటను సినిమాలోని మాస్ సన్నివేశాలను కట్ చేసి యాడ్ చేస్తూ స్పెషల్ ప్రోమోగా మేకర్స్ రిలీజ్ చేశారు. దీనికి ఫ్యాన్స్ నుంచి ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాను ఫిబ్రవరి 27న ప్రముఖ ఓటటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేశారు.
