Asianet News TeluguAsianet News Telugu

హీరో మాటలతో హర్ట్ అయిన దర్శకుడు వి.వి.వినాయక్!

బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తూ 'అల్లుడు శీను' అనే సినిమాను రూపొందించాడు వినాయక్. పక్కా కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందించారు. ఆ సినిమాకి మంచి రెస్పాన్సే వచ్చింది. డెబ్యూ హీరోగా బెల్లంకొండ ఓకే అనిపించాడు. 

VV Vinayak upset over Bellamkonda
Author
Hyderabad, First Published Aug 9, 2019, 1:55 PM IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన 'రాక్షసుడు' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. అయితే ఈ సినిమాతోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రేక్షకులకు నటుడిగా పరిచయమయ్యాడంటూ బెల్లంకొండ సురేష్ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. సాయి శ్రీనివాస్ కూడా ఇదే తనకు తొలి సినిమా అన్నట్లుగా మాట్లాడాడు. ఈ విషయంలో దర్శకుడు వినాయక్ హర్ట్ అయినట్లు సమాచారం.

దానికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేస్తూ 'అల్లుడు శీను' అనే సినిమాను రూపొందించాడు వినాయక్. పక్కా కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా సినిమాను రూపొందించారు. ఆ సినిమాకి మంచి రెస్పాన్సే వచ్చింది. డెబ్యూ హీరోగా బెల్లంకొండ ఓకే అనిపించాడు. ఆ తరువాత నుండి వరుసగా సినిమాలు చేస్తూ తన లక్ ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు.

బోయపాటితో ఓ కమర్షియల్ సినిమా, ఓ రీమేక్ సినిమా ఇలా వరుసగా ప్రేక్షకులపై దండయాత్ర చేశాడు. ఆ సినిమాలన్నీ ఇప్పుడు సినిమాలే కాదన్నట్లుగా చెప్పుకుంటున్నారు బెల్లంకొండ సురేష్ అతడి తనయుడు శ్రీనివాస్. 'రాక్షసుడు' సినిమానే తొలి సినిమా అని చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో మిగతా దర్శకుల సంగతి పక్కన పెడితే.. వినాయక్ మాత్రం స్పందించాడు.

'అల్లుడుశీను' కోసం చేయాల్సిందంతా చేశామని, ఇప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నట్లుగా రియాక్ట్ అయ్యాడు వినాయక్. మరి వినాయక్ కామెంట్లపై బెల్లంకొండ సురేష్, శ్రీనివాస్ లు ఎలా స్పందిస్తారో చూడాలి!
  

Follow Us:
Download App:
  • android
  • ios