టాలీవుడ్ లో సంక్రాంతికి సినిమాల హడావుడి ఏ విధంగా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ బయోపిక్ రామ్ చరణ్ వినయ విధేయ రామ సినిమాలతో పాటు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ F2 కూడా భారీగా రిలీజ్ కాబోతోంది. అందరి చూపు ఎక్కువగా ఈ సినిమాపైనే ఉంది. అయితే ప్రస్తుతం సినిమాకు సంబందించిన ఒక రూమర్ వైరల్ గా మారింది. 

కథానాయకుడు వెంకటేష్ వరుణ్ తో మంచి టైమింగ్ లో కామెడీని పండించారానిది అందరూ గట్టిగా చెబుతున్నారు. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకోకుండా చాలా వరకు షూటింగ్ స్పాట్ లోనే కొన్ని సీన్లను రాయడం చేశారట. దీంతో వెంకటేష్ కి  చిర్రెత్తుకొచ్చిందని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. అనిల్ మీద అరిచేశాడని కూడా మాట్లాడుకుంటున్నారు.

చాలా వరకు అనిల్ ఈ విషయంలో వెంకటేష్ కు సర్ది చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాడట. ఇక సినిమా ఫైనల్ కట్ చూసిన తరువాత దర్శకుడి పని తీరును వెంకటేష్ మెచ్చుకున్నట్లు తెలుస్తోంది. మరి సినిమా జనాలకు ఎంతవరకు నచ్చుతుందో చూడాలి. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించారు.