కోటిన్నర మోసపోయిన రామ్ చరణ్ విలన్.. నమ్మించి మోసం చేసిన పార్టనర్స్.. కేసు నమోదు
నటుడు వివేక్ ఒబెరాయ్ మోసపోయాడు. ఏకంగా కోటిన్నర ఆయన మోసపోవడం గమనార్హం. దీంతో వారిపై కేసు నమోదు చేశారు. తాజాగా ఇది వెలుగులోకి వచ్చింది.

`వినయ విధేయ రామ` చిత్రంలో రామ్‌చరణ్ విలన్‌గా నటించిన వివేక్ ఒబెరాయ్ భారీగా మోసపోయాడు. బిజినెస్ పార్టనర్స్ నమ్మించి మోసం చేశారు. ఏకంగా కోటిన్నర రూపాయలు వివేక్ ఒబెరాయ్ మోసపోవడం గమనార్హం. వివేక్ ఒబెరాయ్ దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముంబయిలోని అంథేరిలోగల `ఎంఐడీసీ` పోలీసస్ స్టేషన్‌లో బుధవారం ఈ ఫిర్యాదు చేశారు వివేక్ ఒబెరాయ్ అకౌంటెంట్. దీంతో తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు, వివేక్ ఒబెరాయ్ అకౌంటెంట్ తెలిపిన వివరాల మేరకు.. ముగ్గురు వ్యక్తులు సినిమా ప్రొడక్షన్, ఈవెంట్‌లో వివేక్ ఒబెరాయ్ చేత కోటి 55లక్షలు ఇన్వెస్ట్ పెట్టించారు. ఇందులో ఓ నిర్మాత కూడా ఉన్నారు. ఇందులో పెట్టుబడి పెడితే లాభాలు బాగున్నాయని చెప్పి ఆయన్ని నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన వివేక్.. రూ.1.55 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అయితే వాళ్లు ఈవెంట్లు, సినిమా నిర్మాణాలు చేయకుండా తమ స్వలాభాలకు వాడుకున్నారు. అందులో నటుడి భార్య కూడా పార్టనర్‌గా ఉన్నారు.
అకౌంటెంట్ ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురు వ్యక్తుల మీద ఎఫ్ ఐఆర్ నమోదు చేశాం. ఐపీసీ సెక్షన్ 34, 409, 419, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ జరుగుతుందని వెల్లడించారు. తమ నటుడికి న్యాయం చేయాలని వివేక్ ఒబెరాయ్ అకౌంటెంట్ వెల్లడించారు. ఇక వివేక్.. మొదట.. `రక్త చరిత్ర` సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యారు. ఇందులో ఆయన పరిటాల రవి పాత్రలో నటించి మెప్పించారు. ఆ తర్వాత రామ్‌చరణ్ హీరోగా నటించిన `వినయ విధేయ రామ` చిత్రంలో విలన్‌గా నటించారు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక హిందీలో హీరోగా, విలన్‌గా నటిస్తూ ఆకట్టుకుంటున్నారు వివేక్ ఒబెరాయ్.