Asianet News TeluguAsianet News Telugu

రాజకీయాల్లోకి వస్తా.. స్టార్ కమెడియన్ హాట్ కామెంట్స్

సీనియర్ స్టార్ యాక్టర్స్ ఎక్కడ కనిపించినా పాలిటిక్స్ కి సంబందించిన ఎదో ఒక కామెంట్ తో వైరల్ అవ్వడం కామన్. మెయిన్ గా కోలీవుడ్ లో అయితే ఈ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. రీసెంట్ గా తమిళ్ సీనియర్ స్టార్ కమెడియన్ వివేక్ కూడా పాలిటిక్స్ పై ఎవరు ఉహించని విధంగా కామెంట్ చేశాడు. 

vivek comments on politics
Author
Hyderabad, First Published May 21, 2019, 1:17 PM IST

సీనియర్ స్టార్ యాక్టర్స్ ఎక్కడ కనిపించినా పాలిటిక్స్ కి సంబందించిన ఎదో ఒక కామెంట్ తో వైరల్ అవ్వడం కామన్. మెయిన్ గా కోలీవుడ్ లో అయితే ఈ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. రీసెంట్ గా తమిళ్ సీనియర్ స్టార్ కమెడియన్ వివేక్ కూడా పాలిటిక్స్ పై ఎవరు ఉహించని విధంగా కామెంట్ చేశాడు. 

నేను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి కోలీవుడ్ మీడియాకు హాట్ న్యూస్ ఇచ్చేశాడు. సోమవారం కోడైకెనాల్‌లోని ఒక ప్రైవేట్‌ కాలేజ్ కి వెళ్లిన వివేక్ అక్కడ తన స్నేహితుడితో కలిసి మొక్కలు నాటారు. విద్యార్థులు నీటి విలువ తెలుసుకోవాలని మొక్కలకు వర్షాన్ని కురిపించే శక్తి ఉందని అన్నారు. తమిళనాడులో చెరువులు కాలువలు మాయమవుతున్నాయని ప్రతి విద్యార్థి ఏడాదికో మొక్క నాటి అందరికి స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. 

ఇక రాజకీయాల గురించి మాట్లాడుతూ.. కమల్ హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి అందరూ అడుగుతున్నారని అయితే అది ఆయన వ్యక్తిగత జీవితామని చెప్పారు. ఇక రజినీకాంత్ తప్పకుండా రాజకీయాల్లోకి వస్తారని చెబుతూ.. భవిష్యత్తులో తాను కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ఈ విషయంపై అంతగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని వివేక్ వివరణ ఇచ్చారు.  

Follow Us:
Download App:
  • android
  • ios