Asianet News TeluguAsianet News Telugu

ఓ రేంజిలో ఉంది..అదరకొట్టిన విశ్వక్ సేన్..!!

ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది.   థ్రిల్లింగ్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత అదిరిపోయేలా కనిపిస్తోంది.  మీరూ ఓ లుక్కేయండి.
  

Vishwaksen, VikasVasista Mukhachitram Theatrical Trailer
Author
First Published Dec 1, 2022, 1:52 PM IST


వికాస్‌ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్‌, అయేషా ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ముఖచిత్రం’. గంగాధర్‌ దర్శకుడు. ప్రదీప్‌ యాదవ్‌, మోహన్‌ గొల్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్‌కెఎన్‌ సమర్పిస్తున్నారు. దర్శకుడు సందీప్‌ రాజ్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఇందులో యంగ్ హీరో విశ్వక్ సేన్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇప్పటికే విడుదల చేసిన సీన్ క్యారెక్టర్ కు సంబంధించి చిన్న గ్లింప్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.  తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. 

ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేదిలా ఉంది. 'అందరూ అనుకుంటున్నా కథ ఇది .. అసలు జరిగింది ఇది'.. అంటూ కథలో అసలు పాయింటును చెబుతూ ఈ ట్రైలర్ ను వదిలారు. ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది.   థ్రిల్లింగ్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత అదిరిపోయేలా కనిపిస్తోంది.  మీరూ ఓ లుక్కేయండి.
  
ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఒక మహిళకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన తర్వాత ప్లాస్టిక్ సర్జన్ తీవ్ర గందరగోళంలో కూరుకుపోయిన కథ అంశంతో ఈ సినిమాని తెరకెక్కించినట్లు ట్రైలర్లు క్లియర్ గా కనిపిస్తోంది. అటు తరువాత ఆ సర్జన్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే అంశంతో ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా ఇచ్చినట్లుగా ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సర్జరీ చేయించుకున్న మహిళగా ప్రియా వడ్లమాని.. సర్జంగ వికాస్ వశిష్ స్నేహితుడిగా చైతన్య రావు కనిపించారు. ఇక్కడ లాయర్ పాత్రలో విశ్వక్ సేన్ నటించడం జరిగింది. మొదటిసారిగా నల్లకోటు ధరించి విశ్వక్ బాగా ఆకట్టుకుంటున్నాడు.

ఈ చిత్రాన్ని గంగాధర్ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇక ఈ చిత్రానికి కథ కలర్ ఫోటో ఫ్రేమ్ సందీప్ రాజా కథ స్క్రీన్ ప్లే మాటలు అందించారు. ముఖచిత్రం సినిమా డిసెంబర్ 9వ తేదీన విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios