Asianet News TeluguAsianet News Telugu

విశ్వక్ సేన్ “ధమ్కీ” రిలీజ్ డేట్ ఫిక్స్!

 రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది. దాంతో  మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

VishwakSen #Dhamki Release date fixed
Author
First Published Nov 24, 2022, 1:37 PM IST

విశ్వ‌క్‌సేన్ హీరోగా న‌టిస్తోన్న ధ‌మ్కీ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సైంది. వ‌చ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మంగ‌ళ‌వారం హీరో విశ్వ‌క్ సేన్  సోషల్ మీడియా వేదికగా అనౌన్స్‌చేశాడు. ఫ‌ల‌క్‌నుమా దాస్ త‌ర్వాత స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో విశ్వ‌క్‌సేన్ రూపొందిస్తోన్న సినిమా ఇది. నివేథా పెతురాజ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.  రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది. దాంతో  మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

ఈ పాన్ ఇండియన్ మూవీ ఫిబ్రవరి 17, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే విషయాన్ని ప్రకటించేందుకు మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ధ‌మ్కీ సినిమాను విశ్వ‌క్‌సేన్ ఫాద‌ర్ క‌రాటే రాజు నిర్మిస్తోన్నారు. లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.   రావు రమేష్‌, హైపర్‌ ఆది, రోహిణి, పృథ్వీరాజ్‌ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ల పై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తుండగా, అన్వర్ అలీ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇత రీసెంట్ గా రిలీజైన దాస్ కా ధమ్కీ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కినట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్దమవుతోంది. రెండు రకాల విభిన్న గెటప్పుల్లో విశ్వక్ కనిపిస్తున్నాడు. ఇందులో ఓ రోల్ పూర్తిగా నెగిటివ్ షేడ్స్  ఉంటాయని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ఫలక్‌నూమా దాస్ మాదిరిగానే ఇందులోనూ కొన్ని అభ్యంతరకర డైలాగులు ఉన్నాయి. వాటిని ట్రైలర్‌లోనే చూపించడం విశేషం.

ఇంజిన్ హీట్‌లోకి వచ్చింది.. ఇంక స్టార్ట్ చేద్దామా అంటూ విశ్వక్ ట్విటర్ వేదికగా తెలియజేశాడు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. విశ్వక్ తనదైన కామెడీ టైమింగ్‌తో పాటు ఎమోషన్, నెగిటివ్ షేడ్స్‌ను కూడా చూపించాడు. ఈ చిత్రంలో రోహిణి, రావు రమేశ్, పృథ్వీరాజ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios