విద్యాధర్ రావు కగిత దర్శకత్వంలో రూపొందించిన ‘గామి’.. మహాశివరాత్రి పర్వదినం కానుకగా శుక్రవారం బిగ్ స్క్రీన్స్​లో విడుదలైంది. 


ఈ అన్ సీజన్ లోనూ తెలుగు ప్రేక్ష‌కుల దృష్టిని బాగా ఆక‌ర్షించిన సినిమా గామి. టీజర్, ట్రైలర్ విడుదల అయ్యాక ఆ విజువల్స్ గురించి చర్చ మొదలైంది. అందులోనూ సినిమాని ఆరు సంవత్సరాలు పాటు తీసారు అంటే ఆశ్చర్యం కనిపించింది. అసలు అది ఎలాంటి సినిమానో ..ఏముంది ఆ సినిమాలో అని చూడటానికి జనం ఉత్సాహం చూపించారు. దానికి మహాశివరాత్రి శెలవు రోజు కలొసొచ్చింది. విద్యాధర్ రావు కగిత దర్శకత్వంలో రూపొందించిన ‘గామి’.. మహాశివరాత్రి పర్వదినం కానుకగా శుక్రవారం బిగ్ స్క్రీన్స్​లో విడుదలైంది. అయితే అర్బన్ ఏరియాలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ రూరల్ ఏరియాలో అంతంత మాత్రంగా ఓపినింగ్స్ వచ్చాయి. ముఖ్యంగా మల్టిప్లెక్స్ లలో మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం మార్నింగ్ షోకు 50 శాతం, మ్యాట్నీకి 60 శాతం, ఫస్ట్ షోకు 50 శాతం, సెకండ్ షోకు 55 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడ్డాయి. బుకింగ్స్ ప్రకారం కలెక్షన్స్ చూస్తే మొదటి రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.3-1.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకుందని ప్రాధమిక అంచనా. ఇదే స్పీడుని ని వీకెండ్ లో చూపించే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ అంచనా వేస్తున్నారు. అలాగే ఓవర్సీస్​లో ప్రీమియర్స్, మొదటి రోజు వసూళ్లు కలిపి 250కే డాలర్స్ అంటే భారత కరెన్సీలో రూ.1.7 కోట్లు కలెక్ట్ చేసిందని తెలుస్తోంది.

ఇక ‘గామి’కి వరల్డ్​వైడ్​గా మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన నైజాం రైట్స్ రూ.3.5 కోట్లు, సీడెడ్ రూ.1.4 కోట్లు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ రూ.3.5 కోట్ల మేర జరిగిందని ట్రేడ్ సమాచారం. ఓవర్సీస్​తో కలుపుకొని ఓవరాల్​గా ఈ సినిమాకు రూ.11 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఫస్ట్ వీకెండ్ లోనే మొత్తం బ్రేక్ ఈవెన్ అయ్యినా ఆశ్చర్యంలేదని అంటున్నారు. చూడాలి.