త ఏడాది వరుస సక్సెస్ లతో కెరీర్ పరంగా మంచి ఊపులో ఉన్న విశాల్ కు ఈ  ఏడాది ఏ రకంగాను టైమ్ కలిసి రావడం లేదు. పందెం కోడి సీక్వేల్ పెద్దగా సక్సెస్ అవ్వలేదు.అలాగే తమిళ నిర్మాతల కమిటి నడిగర్ సంఘం నుంచి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

ఆ వివాధాలనే కాకుండా ఇప్పుడు సరికొత్తగా సినిమా రిలీజ్ కావడమే కష్టంగా మారింది. విశాల్ నటించిన అయోగ్య సినిమా గత కొంత కాలంగా వాయిదాలు పడుతోంది. నేడు రిలీజ్ కావాల్సిన సినిమా చివరి నిమిషాల్లో వాయిదా పడింది. ఆర్థిక సమస్యల వల్లే సినిమా రిలీజ్ కాలేదని సమాచారం. ఇక విశాల్ ఈ విషయంపై సరైన కారణం చెప్పడం లేదు. 

అయితే సినిమా కోసం తాను చేయవల్సిందంతా చేశాను అని అయితే అనుకున్నట్లుగా సినిమాకు ఏం చేసిన సరిపోవడం లేదని వివరణ ఇచ్చారు. అయోగ్య సినిమా తెలుగు టెంపర్ సినిమాకు రీమేక్. ఎంతో ఇష్టంగా చేసిన ఈ సినిమా రిలీజ్ కు తీవ్ర సమస్యలు ఎదుర్కోవడంతో విశాల్ అప్సెట్ అవుతున్నాడు.