Asianet News TeluguAsianet News Telugu

హీరోయిన్ పై రూమర్స్.. నా జీవితంలో ఆమెని కలవలేదు!

సొట్ట బుగ్గల సుందరి తాప్సి బాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకుంటోంది. తాప్సి గురించి రూమర్స్ కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 'ఏక్ లడకి కో దేఖా తో ఐసా లగా' చిత్రం విడుదలయింది. 

Vinod Chopra Gives clarity on rumours regarding Tapsee
Author
Hyderabad, First Published May 17, 2019, 1:45 PM IST

సొట్ట బుగ్గల సుందరి తాప్సి బాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకుంటోంది. తాప్సి గురించి రూమర్స్ కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 'ఏక్ లడకి కో దేఖా తో ఐసా లగా' చిత్రం విడుదలయింది. ఈ బోల్డ్ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. విమర్శలు కూడా వెల్లువెత్తాయి. సోనమ్ కపూర్, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించారు. మహిళా దర్శకురాలు షెల్లీ చోప్రా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

వినోద్ చోప్రా ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రం విషయంలో తాప్సి గురించి వస్తున్న రూమర్లపై వినోద్ చోప్రా క్లారిటీ ఇచ్చారు. మొదట ఈ చిత్రంలో సోనమ్ కపూర్ పాత్రకు తాప్సి సంప్రదించారట. కానీ తాప్సి అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. దీనిపై వినోద్ చోప్రా మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం కోసం తాప్సి కలసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. ఆమెని నా జీవితంలో ఒక్కసారి కూడా కలవలేదు అని వినోద్ చోప్రా తెలిపారు. 

ఇది మీకు చిన్న విషయమే.. కానీ నేను స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ చిత్రాన్ని స్వలింగ సంపర్కం నేపథ్యంలో తెరకెక్కించాం. ఇలాంటి పుకార్లు మా సినిమాపై వ్యక్తిరేక భావనని పెంచుతాయి. కష్టపడి తెరకెక్కించిన ఈ చిత్రంపై విమర్శలు వస్తే మేము తట్టుకోలేం అని వినోద్ చోప్రా అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios