Asianet News TeluguAsianet News Telugu

ఆ కామెంట్స్ ని పవన్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు

 బాహుబ‌లి చిత్రంతో ఒక్క‌సారిగా దేశం దృష్టిని ఆక‌ర్షించారు విజ‌యేంద్ర ప్ర‌సాద్‌. ఇప్పుడు ఆయన ఆర్ఆర్ఆర్ అనే అద్భుతాన్ని సృష్టించారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చింది. మధ్యలో సెకండ్ వేవ్, లాక్డౌన్ వంటివి రావడంతో షూటింగ్ కాస్త గ్యాప్ వచ్చింది.

Vijayendra Prasad about story for pawan and Kamal jsp
Author
Hyderabad, First Published Jun 3, 2021, 4:26 PM IST

ఓ స్టార్ రైటర్ గా భారతదేశమంతా పరిచయం ఉన్న వ్యక్తి విజయేంద్ర ప్రసాద్. తన కథలతో మెస్మరైజ్ చేసే ఆయన తన మాటలోనూ అదే స్దాయిని చూపిస్తారు. ఈ విషయం రీసెంట్ గా అలీ తో సరదాగాలో రివీల్ అయ్యింది. ఇండియా స్టార్ డైరక్టర్స్ లో ఒకరైన రాజమౌళి సినిమా విజయాలన్నిటి వెనక ఆయన ఉన్నారు. ఆయన కథా బలం ఉంది. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా హిందీకి వెళ్లి సల్మాన్ తో భజరంగీ భాయీజాన్ వంటి హిట్ కొట్టి వచ్చారు. బాహుబ‌లి చిత్రంతో ఒక్క‌సారిగా దేశం దృష్టిని ఆక‌ర్షించారు విజ‌యేంద్ర ప్ర‌సాద్‌. ఇప్పుడు ఆయన ఆర్ఆర్ఆర్ అనే అద్భుతాన్ని సృష్టించారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చింది. మధ్యలో సెకండ్ వేవ్, లాక్డౌన్ వంటివి రావడంతో షూటింగ్ కాస్త గ్యాప్ వచ్చింది.

రీసెంట్ గా విజయేంద్ర ప్రసాద్...ఆల్ టైమ్ సూపర్ హిట్ షో.. అలీతో సరదాగా షోకి అతిథిగా విచ్చేశారు. ఇందులో రాజమౌళి, ఆర్ఆర్ఆర్, తన తదుపరి చిత్రాల గురించి ఎన్నెన్నో విశేషాలు పంచుకున్నారు అలాగే స్టార్ హీరోలకు ఎలాంటి కథలు రాస్తే బాగుంటుందని అనుకుంటున్నారని విజయేంద్ర ప్రసాద్‌ను అలీ అడిగారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, కమల్ హాసన్ లుకు ఎలాంటి కథలు ఇస్తారనే విషయమై మాట్లాడారు.
విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. కమల్ హాసన్‌కు స్టోరీ రాయడం వేస్ట్.. ఆయన అన్నీ చేసేశారు. ఆయనకు ఇంకా ఏం రాయలేం అని అన్నారు. పవన్ కళ్యాణ్‌కైతే కథ అవసరం లేదు.. ఆయనుంటే చాలు.. పాటలు, ఫైటింగ్‌లు పెట్టేస్తే చాలు.. జనం ఆయన్ను చూడటానికే వస్తారు.. కథ అవసరం లేదు.. ఆయనో డైనమైట్ విజయేంద్ర ప్రసాద్‌ అని అన్నారు. 

ఇక  అమితాబ్ బచ్చన్‌కైతే ఎలాంటి కథ, క్యారెక్టర్ రాస్తారు అని అలీ అడిగారు. దానికి  పిసినారి పాత్రను ఇంత వరకు పోషించలేదు కాబట్టి అలాంటిది రాస్తాను అని సమాధానం ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios