నాకు ఏడుపొస్తోంది.. హీరోకి ధైర్యం చెబుతోన్న ఫాన్స్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 12, Aug 2018, 12:39 PM IST
vijaya devarakonda tweet about geetha govindam leaked scenes
Highlights

'నేను చాలా నిరాశకు లోనవుతున్నాను.. బాగా హర్ట్ అయ్యాను.. ఒక్కోసారి కోపం వస్తుంది.. ఇంకోసారి ఏడుపొస్తుంది' అంటూ ట్వీట్ చేశాడు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ

'నేను చాలా నిరాశకు లోనవుతున్నాను.. బాగా హర్ట్ అయ్యాను.. ఒక్కోసారి కోపం వస్తుంది.. ఇంకోసారి ఏడుపొస్తుంది' అంటూ ట్వీట్ చేశాడు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. విజయ్ ఎందుకు బాధ పడుతున్నాడో అని అభిమానులు కంగారు పడ్డారు. విషయం తెలిసిన తరువాత అతడికి ధైర్యం చెబుతున్నారు. అసలు విషయంలోకి వస్తే.. విజయ్ నటించిన 'గీతగోవిందం' సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

సినిమా టీమ్ కి చెందిన ఒక వ్యక్తి తన స్నేహితులకు కొన్ని సీన్స్ ఫార్వార్డ్ చేయడంతో అవి సోషల్ మీడియాకెక్కాయి. ఈ విషయంలో చర్యలు తీసుకున్న పోలీసులు కొందరు విద్యార్థులను అలానే సన్నివేశాలను లీక్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.ఈ విషయంలో బాధ పడ్డ విజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా అభిమానులు అతడిని సపోర్ట్ చేస్తూ.. ఎన్ని లీకులు ఎదురైనా. మనకి బ్లాక్ బస్టర్ ఖాయమని కామెంట్ చేస్తున్నారు.

మరికొందరు ఇది మనకి ఫ్రీ పబ్లిసిటీ బయ్యా.. చిల్ అంటూ స్పందిస్తున్నారు. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రష్మిక హీరోయిన్ గా నటించింది. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

 

 

 ఇది కూడా చదవండి.. 

సోషల్ మీడియాలో 'గీతగోవిందం' సీన్లు.. షాక్ లో టీమ్!

 

loader