తన అభిమానులకు విజయ్‌ బర్త్ డే సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్నారట. ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. విజయ్‌ నటిస్తున్న 65వ చిత్ర ఫస్ట్ లుక్‌ విడుదల తేదీని శుక్రవారం ప్రకటించింది యూనిట్‌.

దళపతి విజయ్‌ కొత్త సినిమాకి సంబంధించి అప్‌డేట్‌ వచ్చింది. చాలా రోజులుగా వెయిట్‌ చేస్తున్న విజయ్‌ అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ త్వరలోనే రాబోతుంది. తన అభిమానులకు విజయ్‌ బర్త్ డే సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్నారట. ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడించింది. విజయ్‌ నటిస్తున్న 65వ చిత్ర ఫస్ట్ లుక్‌ విడుదల తేదీని శుక్రవారం ప్రకటించింది యూనిట్‌. ఈ నెల (జూన్‌) 21న సాయంత్రం ఆరు గంటలకు `విజయ్‌ 65` చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నట్టు స్పష్టం చేసింది.

జూన్‌ 22న విజయ్‌ బర్త్ డే. ఈ సందర్భంగా ఒక రోజు ముందుగా `విజయ్‌65` చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతన్నారు. ఈ చిత్రానికి నెల్సన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుథ్‌ సంగీతం అందిస్తున్నారు. కళానిధి మారన్‌ సమర్పణలో సన్‌ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. విజయ్‌ చివరగా `మాస్టర్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఇందులో మాళవిక మోహనన్‌ కథానాయికగా నటిస్తే, విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Scroll to load tweet…