Asianet News TeluguAsianet News Telugu

విభీషనుడిగా విజయ్ సేతుపతి, భారీ బడ్జెట్ తో బాలీవుడ్ లో రామాయణ్ సినిమా

బాలీవుడ్ లో భారీ ఎత్తున రామాయణ్ తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందుల ఒక్కొక్కరుగా స్టార్స్ జాయిన్ అవుతుండగా.. తాజాగా విజయ్ సేతుపతి కూడా ఈూవీలో పాత్ర చేయబోతున్నట్టు సమాచారం. 
 

Vijay Sethupathi  Vibhishana Character In Bollywood Ramayan JMS
Author
First Published Jan 28, 2024, 7:07 AM IST


సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం రాముడు.. రామాయణం చుట్టు తీరుగుతుంది. రామాయణం  ఆధారంగా చాలా సినిమాలు  తెరకెక్కడానికి సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే ఆదిపురుష్, హనుమాన్ లాంటిసినిమాలు దడదడలాండించగా.. భారీ ఎత్తున రామాయణం చేయడానికి స్టార్స్ మేకర్స్ ఇప్పటికే హిట్స్ ఇచ్చారు. టాలీవుడ్ నుంచి ఎప్పుటికైనా రామాయణం భారీగా తీసిచూపిస్తానని రాజమౌళి అన్నారు. అటు అల్లు అరవింద్ కూడా బాలీవుడ్ రామాయణం అనౌన్స్ చేశారు. కాని అది కార్యరూపం దాల్చలేదు. ఎప్పుడో ఒక సారి ఈమూవీస్టార్ట్ అయ్యేఅవకాశం ఉంది. 

ఇక ఈక్రమంలో  బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. దంగల్‌ దర్శకుడు నితీష్‌ తివారీ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రామాయణ్  సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రామాయణ్‌కు సంబంధించి నటీనటుల ఎంపిక జరుగుతోంది. దర్శకుడు చాలా మంది ఆర్టిస్టులతో చర్చలు జరుపుతున్నాడు. ఇప్పటికే రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ లాంటి స్టార్స్ తో మూవీ టీమ్  సమావేశం అయినట్లు సమాచారం. రాముడిగా రణబీర్, సీతగాసాయి పల్లవి...ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇకతాజాగా ఈ సినిమాకి సంబంధించి నటుడు విజయ్ సేతుపతికి ఆఫర్ వచ్చినట్లు సమాచారం . రామాయణంలోని ప్రధాన పాత్రల్లో ఒకటైన విభీషణుడి పాత్రలో నటించేందుకు విజయ్ సేతుపతికి ఆఫర్ వచ్చినట్లు సమాచారం. 

విజయ్ సేతుపతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ పాత్ర ఇచ్చినా  అవలీలగా.. చేసేస్తారు.. మొన్నటి వరకూ సౌత్ కే పరిమితం అయిన విజయ్.. జవాన్, ఫర్జీలాంటి వాటితో  బాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచుకున్నాడు. దానికి ప్రాణం పోసే ప్రతిభ ఆయన సొంతం. సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు.ఇప్పుడు బాలీవుడ్ మూవీ రామాయణం నుంచి ఆఫర్  ను విజయ్ సేతుపతి అందుకున్నారట. ఈసినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అందుకే విజయ్ సేతుపతి కాల్షీట్ అడిగినట్లు సమాచారం.

అంతే కాదు మనీష్ తీవారి నుంచి కూడా విజయ్ సేతుపతికి ఫోన్ వెళ్ళినట్టుసమాచారం. ఆయనే డైరెక్ట్ గా మీరు చేయాలి అని అడిగారట. స్క్రిప్ట్ విషయంలో.. క్యారెక్టర్ విషయంతో విజయ్ పాజిటీవ్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మరి విభీషణుడి పాత్ర చేయడానికి  కోసం మక్కల్‌ సెల్వన్‌ ఒప్పుకుంటారా? లేదా ? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.మార్చి నెలలో ‘రామాయణం’ సినిమా షూటింగ్ జరిగే అవకాశం ఉంది. అప్పటికి నటీనటుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. రామాయణం కథలో చాలా పాత్రలున్నాయి. కాబట్టి ఇది మల్టీ స్టారర్ సినిమా అవుతుంది. ఏ పాత్రకు ఎవర్ని ఎంపిక చేశారనే విషయమై చిత్ర బృందం నుంచి అధికారిక సమాచారం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios