Asianet News TeluguAsianet News Telugu

`RRR` మూవీ బ్యానర్‌లో దళపతి విజయ్‌ సినిమా..? డైరెక్టర్‌ ఎవరంటే ?

దళపతి విజయ్‌ మరో తెలుగు సినిమా చేస్తున్నారు. `వారసుడు`తో ఇప్పటికే మెప్పించిన ఆయన ఇప్పుడు `ఆర్‌ఆర్‌ఆర్‌` ని నిర్మించిన బ్యానర్‌లో సినిమా చేయబోతున్నారట. 

vijay movie with RRR banner ? who director ? arj
Author
First Published Jan 30, 2024, 8:54 PM IST

దళపతి విజయ్‌ ఆ మధ్య తెలుగు మేకర్స్ తో సినిమా చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మాణంలో `వారసుడు` మూవీ చేశారు. ఇది తెలుగు, తమిళంలో ఏక కాలంలో విడుదలైంది. తెలుగులో పెద్దగా ఆడలేదు. తమిళంలో ఫర్వాలేదనిపించుకుంది. ఇప్పుడు మరో తెలుగు సినిమా చేసేందుకు విజయ్‌ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. `ఆర్‌ఆర్‌ఆర్‌` వంటి మూవీని నిర్మించిన డీవీవీ దానయ్య విజయ్‌తో సినిమా చేయబోతున్నారట. 

ఈ మేరకు విజయ్‌తో డీవీవీ దానయ్య చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. విజయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. అయితే దర్శకుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఓ ఆసక్తికర నేమ్‌ బయటకు వచ్చింది. తనకు `వారసుడు` చిత్రాన్ని అందించిన వంశీ పైడిపల్లి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తారని తెలుస్తుంది. `వారసుడు` టైమ్‌లో వంశీపైడిపల్లి వర్క్ నచ్చి మరో ఛాన్స్ ఇచ్చారట విజయ్‌. దీంతో మరో ఇంట్రెస్టింగ్‌ స్టోరీతో సినిమా చేయబోతున్నట్టు సమాచారం. 

ఇక ప్రస్తుతం విజయ్‌ తమిళంలో వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో `ది గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌`(గోట్) చిత్రంలో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్‌ యాక్షన్‌ మూవీగా ఇది రూపొందుతుంది. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది.ఆమెతోపాటు పార్వతి నాయర్‌ మరో పాత్ర పోషిస్తుంది. వీరితోపాటు ప్రభుదేవా, ప్రశాంత్‌, స్నేహా, లైలా కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. 

ఈ మూవీ తర్వాత `డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్` బ్యానర్‌లో సినిమా రాబోతుందట. ఇక డీవీవీ దానయ్య ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌తో `ఓజీ` మూవీని నిర్మిస్తున్నారు. పవన్ పొలిటికల్‌గా బిజీగా ఉండటంతో ఈ మూవీ షూటింగ్‌ని వాయిదా వేశారు. ఎలక్షన్ల తర్వాత మళ్లీ ప్రారంభం కానుంది. దీంతోపాటు నానితో సుజీత్‌ దర్శకత్వంలో ఓ సినిమా ఉందట. అలాగే తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ `అధీర` మూవీ చేస్తున్నారు. ఇప్పుడు విజయ్‌తో సినిమా, అలాగే మరో రెండు ప్రాజెక్ట్ లను లైన్‌లో పెట్టినట్టు సమాచారం. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios