వీరాభిమానులకు కేర్ ఆఫ్ అడ్రెస్ కోలీవుడ్. అక్కడ మాస్ హీరోలకు ఉండే ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తమ ఆరాధ్య నటులకు గుడులు కట్టే సాంప్రదాయం బహుశా అక్కడే మొదలైనదేమో. అభిమాన హీరోకి పాలాభిషేకం చేసే అక్కడి ఫ్యాన్స్ మరో హీరో ఫ్యాన్స్ పై కత్తిదూస్తారు. తమిళనాడులో ఫ్యాన్ వార్స్ సర్వసాధారణం కాగా, ఒకరినొకరు చంపుకొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వీరాభిమానులున్న హీరోలలో తలపతి విజయ్ ఒకరు. తమిళనాట అత్యధిక ఫాలోయింగ్ కలిగిన హీరోగా విజయ్ అవతరించారు. వరుస విజయాలు ఆయన్ని మాస్ ఆడియన్స్ కి బాగా దగ్గర చేశాయి. 

కాగా విజయ్ ఫ్యాన్ ఒకరు ఆత్మహత్య చేసుకొని మరణించడం జరిగింది. కారణం ఏమిటో తెలియదు కానీ బాల అనే ఓ యువ అభిమాని సూసైడ్ చేసుకున్నారు. హీరో విజయ్ వీరాభిమానిగా బాగా గుర్తింపు ఉన్న అతని మరణానికి విజయ్ ఫ్యాన్స్ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో రిప్ బాలా అనే యాష్ ట్యాగ్ తో భారీగా ట్రెండ్ చేస్తున్నారు. అభిమాని మరణం కూడా సోషల్ మీడియాలో ఈ స్థాయిలో ట్రెండ్ కావడం అనేది నిజంగా గొప్ప విషయమే. హీరో విజయ్ పట్ల అభిమానులకు ఏ స్థాయి ప్రేమ వుందో తెలియజేయడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది చెప్పండి. 

ప్రస్తుతం విజయ్ అభిమానులు మొదలుపెట్టిన ఈ ట్రెండ్ హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని దాదాపు అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా రాస్తున్నాయి. కాగా విజయ్ నటించిన మాస్టర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే విడుదల కానుంది. ఇక ఈ మూవీలో విజయ్ గ్యాంగ్ స్టర్ మరియు ప్రొఫెసర్ గా రెండు భిన్న పాత్రలు చేస్తున్నారు. ఇక విజయ్ సేతుపతి విలన్ రోల్ చేయడం మరో విశేషం.